ఎగిలివారంగ లేసి..
చార్మింగ్ స్టార్ శర్వా(Charming Star Sharwa) ‘భోగి’ చిత్రం(Bhogi Film) తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ తాజాగా ‘ఎగిలివారంగ’ పాటతో ప్రారంభించారు. భీమ్స్ సిసిరోలియో స్వరపర్చిన ఈ పాటకు చంద్రబోస్ తెలంగాణ మాండలికంలో అందించిన సాహిత్యం ఒకప్పటి పల్లె వాస్తవాలను కళ్లకు కట్టినట్లు ఆవిష్కరిస్తోంది.
ఈ గీతాన్ని నల్గొండ గద్దర్ నర్సన్నతోపాటు నర్సిరెడ్డి, కందుకూరి శంకర్‌బాబు, రేలారే గోపాల్ పాడారు. ఉత్సాహభరితమైన జానపద సంగీతం, మనసుకు హత్తుకునే సాహిత్యం, కళ్లు కట్టే విజువల్స్‌తో ఈ మూవీ మ్యూజికల్ జర్నీకి మంచి ఆరంభాన్నిచ్చిందీ గీతం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కిషోర్ కుమార్; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్; ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె.