అఖిలభారత 36వ రైతు మహాసభను జయప్రదం చేయండి
రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి
వెంకటాపురం, నూగూరు, నవంబర్ 10,విజయక్రాంతి: నవంబర్ 15 నుండి 18 వరకు జరిగే అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలను(National Conference of the All India Kisan Sabha) జయప్రదం చేయాలని, రైతు సంఘం(Farmers' Association) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి మంగళవారం నాడు ,మండలంలోని గ్రామాలలో రైతు సంఘం(Farmers' Association) ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించినారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి. మాట్లాడుతూ నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలో జరుగు 36వ అఖిలభారత మహాసభలు జరగనున్నాయి.
ఈ మహాసభలను రైతులు(Farmers) అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో విదేశాల నుండి వ్యవసాయ ఉత్పత్తులు(Agricultural products) మొక్కజొన్న పత్తి పాలు(Corn, cotton) వంటి ఉత్పత్తులు సుంఖాలు లేకుండా దిగుమతికి అవకాశం ఇచ్చి ఈ దేశ రైతులను తీవ్రంగా దెబ్బతిస్తున్నానని పేర్కొన్నారు.
ఈ మహాసభలలో రైతుల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు రైతులందరికీ రుణమాఫీ చేయాలని పార్లమెంట్లో మద్దతు ధర చట్టం అమలు చేయాలని రైతులు పండించిన పంటకు ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని 60 ఏళ్లపై పడ్డ రైతులకు పదివేల పెన్షన్ నెలకు ఇవ్వాలని విద్యుత్తు సంస్కరణలు నిలుపు చేయాలని రైతులందరికీ విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని ఇంకా రైతు నేర్పుతున్న నకిలీ విత్తన సమస్య వంటి అనేక అంశాలు ఈ మహాసభలలో చర్చిస్తామని పేర్కొన్నారు.
రైతులందరూ 15 జరుగు బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గ్యానం వాసు, కుమ్మరి శీను ,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టెం ఆదినారాయణ, నాయకులు కంటెం సత్యం, తోట నాగేశ్వరరావు ,రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు వంక రాములు, రైతు సంఘం సీనియర్ నాయకుడు,కురుసనరసింహారావు ,సర్పంచ్ జి కృష్ణ, పి కృష్ణ, ఇరుప శీను ,తదితరులు పాల్గొన్నారు