డిసిసి మహిళా అధ్యక్షురాలుగా తిరుమల ప్రగడ అనురాధ

10-11-2026 | 04:59pm

అధ్యక్షురాలుగా హ్యాట్రిక్ సాధించడం పట్ల సర్వత్ర హర్షం

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావుకు, తిరిగి మూడోసారి, హ్యాట్రిక్ దిశలో, జిల్లా అధ్యక్షురాలిగా నియామకం కృషిచేసిన టిపిసిసి మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి, స్వర్ణలత, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

గడిచిన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో జిల్లాలో ప్రతి నియోజకవర్గాన్ని తనదైన శైలిలో తిరుగుతూ, మహిళలను చైతన్య పరుస్తూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి దోహదపడినందున, ముచ్చటగా మూడోసారి సూర్యాపేట జిల్లాకు మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని పొందడం జరిగిందని, దీనితో ఆమె జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

గడిచిన ఆరు సంవత్సరాలుగా సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గాల్లో అత్యధిక సభ్యత్వ నమోదు చేసిన ఘనత ఆమెకే దక్కింది. అనురాధ నియామకం పట్ల సూర్యాపేట ,తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, కుటుంబ సభ్యుల ,మేధావులు, జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు