ప్రభుత్వ సంక్షేమ పథకాలు పౌరులందరికీ చేరాలి
ముందు చూపుతో వ్యవహరించి ఉపాధి కల్పించాలి..
బోథ్ నవంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా అధికారులు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు కార్యదర్శిలు కృషి చేయాలని బోథ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ(Market Committee Chairman Mallepula Satyanarayana), ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్‌లు కోరారు.
సోనాల మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల సమీక్ష సమావేశం నోడల్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీడీవో రత్నాకర్ రావు రెవెన్యూ అధికారి మల్లేష్ లతో పాటు పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్ ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ రానున్న రోజుల్లో నీటి కరువు ఏర్పడకుండా గ్రామపంచాయతీ కార్యదర్శి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పైప్ లైన్ లీకేజీ ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా చూడాలని కోరారు.
గ్రామాల అభివృద్ధిలో గ్రామాల సర్పంచ్‌లతో పాటు ప్రజాప్రతినిధులు సహకార అందించాలన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్మ చైర్మన్లు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరే విధంగా తమ ప్రభుత్వం చూస్ చేస్తుంది అన్నారు. అధికారులు గ్రామాల అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. భవిష్యత్తులో మంచి నీటి ఎద్దడి ఎదురు కాకుండా ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఆశించిన లక్ష్యం నెరవేర్చేంతవరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు కోరారు