బోధన్ ఎంఈఓ పదవికి ఏ. నాగయ్య రాజీనామా

10-11-2026 | 04:57pm

అనారోగ్య కారణాలతో ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం

బోధన్, నవంబర్ 10 (విజయక్రాంతి): బోధన్ మండల(Bodhan Mandal) విద్యాధికారిగా (ఎంఈఓ) విధులు నిర్వహిస్తున్న ఏ. నాగయ్య()A. Nagayya) తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో(Health problems) బాధపడుతున్న ఆయన, తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇంచార్జ్ మండల విద్యాధికారి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

ఎంఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం ఆయన తిరిగి తన పూర్వ విధుల్లో చేరనున్నారు. కల్దుర్కి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు కొనసాగించనున్నారు.

విద్యాశాఖలో(Department of Education) ప్రధానోపాధ్యాయుడిగా సేవలందిస్తూ, అదనంగా బోధన్ మండల విద్యాధికారి బాధ్యతలు నిర్వహించిన నాగయ్య ఆరోగ్య కారణాలతో ఇంచార్జ్ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడం విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు