ఓటరుగా నమోదు కావడం ప్రతీ ఒక్కరికీ సామాజిక బాధ్యత
టిడబ్ల్యూఓ ఈపి ప్రేమలత
ములుగు, నవంబర్ 12 (విజయక్రాంతి): ఓటర్ గా నమోదు కావడం, ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని డి డబ్ల్యూఓ ఈపి ప్రేమలత(DWO EP Premalatha) అన్నారు. గురువారం ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటరు నమోదు ఓటు యొక్క ప్రాముఖ్యత పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఎస్విఈఈపి ములుగు జిల్లా నోడల్ ఆఫీసర్, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్ వి ఈ ఈ పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశ్యం, దాని ప్రాముఖ్యత ను వివరించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరుగా నమోదైన ప్రతీ ఒక్కరూ తప్పకుండా తమ ఓటును వినియోగించుకోవాలని, ఎందుకంటే ఓటు హక్కు మాత్రమే కాదు,
ఓటరుగా నమోదైన ప్రతీ ఒక్కరికీ సామాజిక బాధ్యత అన్నారు. ఓటరుగా నమోదైన ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఓటు వేస్తే అది సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని, మనమంతా బాధ్యతగా ఓటు నమోదు శాతాన్ని పెంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో భారత ఎన్నికల సంఘం నియమావళిని అనుసరించి ఓటు ప్రాముఖ్యతను అందరికీ వివరిస్తామని, ఓటు శాతం పెంచడానికి మావంతు ప్రయత్నం చేస్తామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, సఖి సిఎ లావణ్య, హరికృష్ణ, సూపర్వైజర్ సుదర్శన్, కేసు వర్కర్ చంటి, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.