బియ్యం అధిక ధరలకు విక్రయించిన వారిపై కఠిన చర్యలు
- కిరాణాషాపులు ముందు ధరలు పట్టిక ప్రదర్శించాలి.
- తహసిల్దార్ వేణుగోపాల్.
వెంకటాపురం ,నూగూరు, నవంబర్ 12 విజయ క్రాంతి: రాష్ట్ర ప్రభుత్వం(State Government) బియ్యం రిటైల్ అమ్మకపు ధరలు ప్రకారం విక్రయించాలని, ప్రతి షాపు ముందు ధరల పట్టిక ప్రదర్శించాలని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని, ములుగు జిల్లా వెంకటాపురం తాసిల్దార్ ఎం. వేణుగోపాల్ తెలిపారు. గురువారం సాయంత్రం రెవిన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దిగువ తెలిపిన విధంగా అమ్మకాలు చేపట్టాలని తెలిపారు.
బిపిటి/ కే ఎన్. ఎం ధరకిలో 66/-రూపాయలు, 2.ఆర్ఎన్ఆర్ /తెలంగాణ సోన బియ్యం కిలో ధర: 74/- రూపాయలు, (జై శ్రీరామ్) బియ్యం ధర: 79/- రూపాయలు, విక్రయించాలని కోరారు. ప్రభుత్వం సూచనల మేరకు, ములుగు జిల్లా కలెక్టర్,ఆదేశాలు తొ మండలం లోని నిత్యావసర దుకాణాలలో, పైన తెల్పిన ధరలకు అమ్మకాలు జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
మండలంలోని అన్ని నిత్యావసర దుకాణాలో ప్రభుత్వం సూచించిన ధరలకు మాత్రమే అమ్మకాలు చేయాలని, నిత్యావసర దుకాణా యజమానులకు తెలియజేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ తాసిల్దార్ టీ. నేతాజీ, ఆర్ ఐ విష్ణు వర్ధన్ .తదితరులు పాల్గొన్నారు.