31 August, 2026 | 2:51 AM

ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఎంపీ మల్లు రవి

31-08-2026 02:01 AM

ఎర్రవల్లి, ఆగస్టు 30: నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి ఎర్రవల్లి మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్తో కలిసి ఆలయానికి చేరుకున్న ఎంపీకి ఈవో సురేందర్, వేద పండితులు, అర్చకులు పూర్ణకలశంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఎంపీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.