31 August, 2026 | 3:41 AM

ఘనంగా ఆంజనేయస్వామి ధ్వజస్తంభం పునర్‌నిర్మాణం

31-08-2026 02:05 AM

మద్దూర్, ఆగస్టు 30 : మండల కేంద్రంలో గత రెండు రోజుల నుంచి శ్రీ ఆంజనేయస్వామి దివ్య ధ్వజస్తంభ పునర్నిర్మాణ పూజా కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. రెండు రోజుల నుంచి వేద పండితులచే ధ్వజస్తంభ పూజ కార్యక్రమాలు కొనసాగాయి. ఊరి ఆడపడుచులు మహిళలు రెండో రోజులనుంచి తండోపతండాలుగా పూజా కార్యక్రమాలలో పాల్గొని అంజనేయ స్వామి ఆశీస్సులు పొందారు. వేద పండితులు యజ్ఞాలు చేసి ధ్వజస్తంభానికి జీవం పోసి పునర్ నిర్మించారు.

ఆదివారం మధ్యాహ్నం ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సరస్వతి జనార్ధన్ ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.