కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి
డీఎల్ఎస్ఏ కార్యదర్శి నిహారిక
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(District Legal Services Authority) కార్యదర్శి నిహారిక గురువారం నాగర్ కర్నూల్లోని జ్ఞానేశ్వర వాత్సల్య మందిరం చిల్డ్రన్ హోమ్(Gnaneshwara Vatsalya Mandiram Children’s Home)ను సందర్శించారు. చిన్నారులతో మాట్లాడి వారి యోగక్షేమాలు, ఆహార సదుపాయాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థి దశ ఎంతో కీలకమని, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. చిన్నారులకు ఏవైనా సమస్యలు ఉంటే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. వారితో పాటు న్యాయవాది శ్రీరామ్ ఆర్య, హోమ్ నిర్వాహకులు పాల్గొన్నారు.