ప్రతి ఇంటికి ఇందిరమ్మ కుటుంబ బీమా

19-11-2026 | 02:42pm

బిజినేపల్లి, నవంబర్ 19 (విజయక్రాంతి): దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi Birth Anniversary) నేడు ప్రజల మధ్య లేకపోయినా, ఆమె జ్ఞాపకంగా, ప్రతి కుటుంబానికి భరోసాగా ఇందిరమ్మ కుటుంబ బీమా (Indiramma Family Insurance) రూపంలో మళ్లీ మన మధ్యకు వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు మిద్దె రాములు అన్నారు.

గురువారం మండల కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యం, తెగువ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలో ఉండాలని ఆకాంక్షించారు. ఆమెకు ఘన నివాళిగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ బీమా పథకం (Insurance Scheme) ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగానమోని తిరుపతయ్య, వాల్యా నాయక్, మాన్యా నాయక్, కత్తె ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు