పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరనీయం

21-10-2026 | 02:48pm

నాగర్‌ కర్నూల్ అక్టోబర్ 21 ( విజయక్రాంతి ) : పోలీస్ అమరవీరుల త్యాగాలు(Sacrifices of Police Martyrs) చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి. పాటిల్(District SP Dr. Sangram Singh G. Patil) అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అమరవీరులకు నివాళులర్పించి, అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సోమశిల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ(Police Department) అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు