లేబర్ కోడ్ల రద్దు.. స్వామినాథన్ సిఫారసుల అమలు డిమాండ్
కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ హన్మంతు
పెంట్లవెల్లి నవంబర్ 27: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) పెంట్లవెల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం(Statue of Ambedkar) ముందు శుక్రవారం నాడు సిఐటియు-కెవిపిఎస్ ప్రజాసంఘాల(CITU-KVPS People's Organizations) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ హన్మంతు మాట్లాడుతూ. దేశవ్యాప్తంగా కార్మిక రైతు సామాజిక సంఘాలు(Labor and Peasant Social Organizations) ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నిరసన చేయడం జరుగుతుందని కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం 2021 లో రైతులు(Farmers) ఆందోళన చేయగా పంటలకు కనీస మద్దతు ధర ఎం ఎస్ పి చట్టబద్ధత చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు.
నేటికీ అది అమలు కాక అలాగే ఉందని ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించాలని అన్నారు. స్వేచ్ఛ వాణిజ్యాన్ని రద్దు చేయాలని కోరారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వలన మన దేశంలో సాగు చేస్తున్న రైతుకు గిట్టుబాటు ధర రాకా నష్టాలు దిగుబడి రాక రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని కాబట్టి తక్షణమే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కనీస వేతనాలు 24000 ఇవ్వాలని నాలుగు లేబర్ కోడ్ల ను రద్దు చేయాలని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేయాలని చూస్తుందని రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి వాళ్లు రాజ్యాంగ స్థానంలో మనుధర్మ శాస్త్రం నీ అమలు చేయాలని చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు అమ్ములమ్మ చందు పద్మ దేవమ్మ చెన్నమ్మ ఓంకారమ్మ ఈశ్వర య నరసింహ సరస్వతయ్య తదితరులు పాల్గొన్నారు.