గొలుసుకట్టు చెరువులకు నీరు చేరేలా కాలువల మరమ్మత్తులు

10-11-2026 | 08:12pm

చిట్యాల, నవంబర్ 10 (విజయక్రాంతి): చిట్యాల మండలం(Chityala Mandal) పెద్దకాపర్తి గ్రామంలో వి.బి. రాంజీ ఉపాధి పథకం(VB Ramji Employment Scheme) కింద పెద్ద చెరువు అలుగు నుంచి వృథాగా పోతున్న నీటిని కింద ఉన్న  గొలుసుకట్టు చెరువులకు మళ్లించేలా కాలువల మరమ్మత్తు పనులు  గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం(Village Sarpanch Katam Venkatesham) ఆధ్వర్యంలో  మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇంకుడు గుంతలు, పాంప్లాంట్లు, గొలుసుకట్టు కాలువల ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టి ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. నీరు వృథా కాకుండా సంరక్షించుకోవడం ద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడిని నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మర్రి హరీష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, గంటల పుల్లారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ చేకూరి మల్లేష్, కారోబార్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు