ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

21-11-2026 | 06:26pm

దామరచర్ల : విజయక్రాంతి : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను(welfare schemes) చేరవేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(MLA Battula Lakshma Reddy) అన్నారు. దామరచర్ల మండల కేంద్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా(Indiramma Family Life Insurance) నమోదు కార్యక్రమాన్ని శనివారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ కుటుంబ భీమా పధకం(Indiramma Family Insurance Scheme) ద్వారా ప్రతి కుటుంబానికి భద్రత కల్పించడమే లక్ష్యమన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాను అర్హులందరు సద్వినియోగం చేసుకోవాలని  కోరారు. నమోదు ప్రక్రియ(Registration Process) ను వేగవంతం చేయాలని కోరారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి పధకం ప్రయోజనాల అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాలి ప్రియాంక,కార్యదర్శి పున్నయ్య ,మాజీ సర్పంచ్ బంటు కిరణ్ ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగునాయక్, గాజుల శ్రీనివాస్, పడిగేపాటి కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు