యోగ కేంద్రానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతి

07-10-2026 | 06:07pm

చిట్యాల, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఋషి సంస్కృతి యోగ సేవా కేంద్రం నిత్య సాధన యోగ ధ్యాన మందిరం వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ నిత్య యోగ ధ్యాన సాధకులు చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్, మున్సిపల్ కమిషనర్‌ గురులింగం(Municipal Commissioner Gurulingam)కు బుధవారం వినతిపత్రం అందజేశారు. యోగ కేంద్రం వరకు సీసీ రోడ్డు నిర్మించాలని, విద్యుత్ స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేయాలని, యోగ కేంద్రం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు. అలాగే సాధకులకు ప్రస్తుత హాల్ సరిపోకపోవడంతో భవనం విస్తరణకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ గీత రమేష్ మాట్లాడుతూ యోగ సాధకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీసీ రోడ్డు, ప్రహరీ గోడ, విద్యుత్ స్తంభాలు, భవనం విస్తరణకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. వీలైనంత త్వరగా, ఆరు నెలల్లో పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు బూరుగు కృష్ణయ్య, కమిటీ అధ్యక్షుడు మాస శ్రీనివాస్, ముఖ్య సలహాదారులు నారబోయిన శ్రీనివాస్, కంచర్ల ఈశ్వరయ్య, నీల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పొన్నం లక్ష్మయ్య, గాదె ఎల్లేష్, కార్యదర్శులు దాడి అరుణ, కోనేటి సాయిరాం, కమిటీ సభ్యులు, యోగ సాధకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు