కలెక్టర్ ను కలిసిన రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు
ఖానాపూర్ ( విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎలక్షన్(Indian Red Cross Society Election) గెలిచిన చైర్మన్ గోజ్జా జనార్ధన్ ,వైస్ చైర్మన్ ఎంసీ లింగన్న, కోశాధికారి డా. అల్లాడి రవి , రాష్ట్ర యం.సి డైరెక్టర్ చామనపల్లి రాఘవులు నిర్మల్ జిల్లా యం.సి.డైరెక్టర్ ఎస్.కె.ముజాహిద్ , నాయుడి రమేష్ , రాజేశ్వర్ , నాగభూషణం, అయ్యన్నగారి భూమయ్య,గంగన్న తదితర సభ్యులను పిలిపించి గెలుపొందిన వారిని కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. మనమందరం కలిసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఎట్ల పని చేయాలో సామాజిక సేవలు చేస్తూ ఎట్ల ముందు కెళ్లాలీ మనమందరం కలిసి మంచి ప్లాన్ చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్దామని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యాలయాన్ని నిర్మాణం చేద్దామని తెలిపారు.