చనఖ-కోర్ట ప్రాజెక్ట్ కెనాల్ లో నీటిని విడుదల చేయాలి

07-10-2026 | 07:12pm

తాంసి/భీంపూర్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): తమ పంటలకు సాగునీటి అవసరం ఎంతో ఉందని, ఎండలకు పంటలు ఎండి పోతున్నాయని, కెనాల్ లో నీటిని విడుదల చేయాలని భీంపూర్ మండలం నీపాని గ్రామ రైతులు బుధవారం ఇరిగేషన్ శాఖ ఏఈ సునీల్(AE Sunil)ను కలిసి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చనఖ-కోర్ట ప్రాజెక్ట్ కెనాల్ లో డి6 పంపు  నీటిని విడుదల చేస్తే నిపానితో పాటు చుట్టూ పక్కల గ్రామాల రైతులకు సాగునీటి సౌకర్యం అందుతుందని, అధికారులు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు మల్లెల స్వామి, కేమ రాజన్న, అమ్రేందర్, వినోద్, ఆకాష్, మహబూబ్, శివన్న, శంకర్ తదితరులు పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు