బీజేపీలోకి స్టార్ క్రికెటర్
చాహల్ కొత్త ఇన్నింగ్స్.. క్రికెట్ నుంచి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ!
భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కెరీర్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. మైదానంలో తన Spin Bowlingతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన ఈ స్టార్ క్రికెటర్.. ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ (BJP) ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గంలో చాహల్‌కు ప్రత్యేక ఆహ్వానితుడిగా బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడైంది. ఈ పరిణామంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
బీజేపీలోకి చాహల్.. మోదీ, అమిత్ షాలకు స్పెషల్ థ్యాంక్స్!
బీజేపీలో చేరిన విషయాన్ని యుజ్వేంద్ర చాహల్ తన Social Media పోస్ట్ ద్వారా ధ్రువీకరించారు. తనకు పార్టీలో స్థానం, గౌరవం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కుటుంబంలో తనకు అవకాశం కల్పించడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
OBC మోర్చాలో చాహల్‌కు కీలక బాధ్యత
బీజేపీ విడుదల చేసిన New Appointments Listలో చాహల్ పేరును ఢిల్లీ తరఫున Special Inviteeగా చేర్చారు. ఆయనతో పాటు ఒడిశాకు చెందిన అద్వైత్ చరణ్ గణనాయక్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయవాది సీమా సమృద్ధి కుష్వాహాలకు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. ఓబీసీ మోర్చా National Executiveలో మొత్తం 37 మంది సభ్యులకు చోటు కల్పించడంతో పాటు ఏడుగురు జాతీయ ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఏడుగురు కార్యదర్శులను నియమించారు. ఈ కొత్త Teamలో తెలంగాణకు చెందిన కడగంచి రమేశ్‌కు జాతీయ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. జాతీయ ఉపాధ్యక్షులుగా జోగెన్ మోహన్, మమతా మొహంతా, సంగమ్ లాల్ గుప్తా, బబన్‌రావు చౌదరి, సత్ ప్రకాశ్ రాణా, అర్జున్ సహాని, సంగీతా బల్వంత్ బింద్లను నియమించారు.
జాతీయ ప్రధాన కార్యదర్శులుగా గజేంద్ర యాదవ్, ప్రమోద్ మధ్వరాజ్, లలిత్ చంద్రకర్లకు బాధ్యతలు ఇచ్చారు. అలాగే జాతీయ కార్యదర్శులుగా దశరథ్జీ ఠాకూర్, టి. వరదరాజన్, సంజీవ్ కుమార్, సరితా జాంగిడ్, వైభవ్ పన్వార్, భీమ్ కుమార్ సాహులతో పాటు తెలంగాణకు చెందిన కడగంచి రమేశ్‌ను ఎంపిక చేశారు. రాధేశ్యామ్ యాదవ్‌కు జాతీయ కోశాధికారి, సంజయ్ కుమార్ గుర్జర్‌కు జాతీయ కార్యాలయ కార్యదర్శి, డాక్టర్ అరుణ్ యాదవ్‌కు సహ కార్యాలయ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. అజయ్ గుప్తాను మీడియా కోఆర్డినేటర్‌గా నియమించారు.
క్రికెట్లో చాహల్ రికార్డులివే!
భారత జట్టు తరఫున చాహల్ ఇప్పటివరకు 72 ODI మ్యాచ్‌లు ఆడి 121 వికెట్లు పడగొట్టాడు. 80 T20 International మ్యాచ్‌లలో 96 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. IPLలో 188 మ్యాచ్‌లు ఆడి 233 వికెట్లు సాధించాడు. లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. గతంలో మహమ్మద్ అజారుద్దీన్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, గౌతమ్ గంభీర్, యూసుఫ్ పఠాన్ వంటి క్రికెటర్లు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు చాహల్ కూడా ఈ జాబితాలో చేరడంతో ఆయన Political Journey ఎలా ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.