జంతర్ మంతర్ వద్ద టెన్షన్.. రాహుల్, ప్రియాంక అరెస్ట్

07-10-2026 | 06:47pm
ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ INDIA కూటమి ఎంపీలు చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు.

జంతర్ మంతర్ వైపు వెళ్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకు అనుమతి లేదని పేర్కొంటూ వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం(Argument), తోపులాట చోటుచేసుకుంది.

తమను నిరసన ప్రదేశానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని, తమపై దాడి చేశారని INDIA కూటమి ఎంపీలు ఆరోపించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీని పోలీసులు వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త(High Tension) పరిస్థితి నెలకొంది. మరోవైపు, నిరసనకు అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో జంతర్ మంతర్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా Security ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

మరిన్ని వార్తలు