కర్ణాటకలో కోటి ఓట్ల కోత!

28-10-2026 | 05:25am
  1. సర్ తర్వాత ఓటర్ల సంఖ్య 4.55 కోట్లు
  2. ఎస్‌ఐఆర్ ముందు 5,54,32,314 మంది ఓటర్లు
  3. రాష్ట్రంలో తుది జాబితా విడుదల

బెంగళూరు, అక్టోబర్ 27: కర్ణాటకలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(Special Intensive Revision) (ఎస్‌ఐఆర్) ప్రక్రి య తర్వాత ఓటర్ల జాబితా నుంచి సుమారు కోటి పేర్లను తొలగించారు. మొత్తం ఓటర్ల సంఖ్య 5.54 కోట్ల నుంచి 4.55 కోట్లకు తగ్గింది. 2,25,83,107 మంది పురుష ఓటర్లు, 2,29,14,063 మంది మహిళా ఓటర్లు, 2,841 మంది ట్రాన్స్‌జెండర్ (ఇతర లింగ) ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు కర్ణాటకలో మంగళవారం తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తుదిజాబితాలో 18- ఏళ్ల వయస్సు గల ఓటర్లు 6.83 లక్షలకు పైగా ఉండగా, 85 ఏళ్లు పైబడిన వారు 3,92,134 మంది ఉన్నారు.

అలాగే, 3,252 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు(NRI Voters) కూడా ఉన్నారు. సర్ ప్రక్రియకు(SIR Process) ముందు రాష్ట్రంలో 5,54,32,314 మంది ఓటర్లు ఉండేవారు. ఇప్పుడు, 99.32 లక్షల పేర్లను తొలగించిన తర్వాత, తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 4,55,00,011గా నమోదైంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతోన్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో లక్షల ఓట్లు తొలగింపునకు గురవుతున్నాయి. దీనిపై విమర్శలు, ఆరోపణలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో కోటి కోట్లను తొలగించడం ఇటు రాష్ట్రంలోనూ, అటు దేశవ్యా ప్తంగా పెనుసంచలనం సృష్టిస్తోంది.

బెంగళూరులో మంగళవారం ప్రధాన ఎన్నికల అధికారి(Chief Electoral Officer) (సీఈఓ) వీ అన్బుకుమార్ మీడియాతో మాట్లాడారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించినప్పుడు ఓటర్ల సంఖ్య 4.46 కోట్లుగా ఉందని గుర్తుచేశారు. ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా మొత్తం దరఖాస్తుల సంఖ్య 26.23 లక్షలకు చేరిందని,  4వేలే ఆఫ్‌లైన్‌లో, మిగిలినవన్నీ ఆన్‌లైన్‌లోనే దాఖలు చేశారని స్పష్టంచేశారు. 

మరిన్ని వార్తలు