భార్యతో విడిపోయిన టీవీకే మంత్రి

16-11-2026 | 03:04pm

14 ఏళ్ల బంధానికి ముగింపు.. టీవీకే మంత్రి దంపతుల కీలక నిర్ణయం!

చెన్నై: తమిళనాడు రాజకీయ వర్గాల్లో(Tamil Nadu Political) ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కజగం (టీవీకే) నేత, మంత్రి ఆదవ్ అర్జున(TVK Minister Aadhav Arjuna), ఆయన భార్య డైసీ మార్టిన్(Daisy Martin) తమ 14 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని డైసీ సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

14 ఏళ్లుగా ప్రేమ, అవగాహనతో సాగిన తమ ప్రయాణంలో ఇప్పుడు వేర్వేరు మార్గాల్లో ముందుకు వెళ్లాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే తమ బిడ్డ భవిష్యత్తు, సంతోషం, శ్రేయస్సు విషయంలో ఇద్దరి బాధ్యత కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఆదవ్ అర్జునపై తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని, ఆయన భవిష్యత్తులో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు డైసీ పేర్కొన్నారు. ఈ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించాలని, తమకు గోప్యత కల్పించాలని ప్రజలను అభ్యర్థించారు. కాగా, ప్రముఖ లాటరీ వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్ కుమార్తె అయిన డైసీ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. మరోవైపు ఆదవ్ అర్జున గతంలో వీసీకే నుంచి టీవీకేలో చేరారు. అయితే వీరి విడాకుల ప్రక్రియ ప్రారంభమైనట్లు లేదా పూర్తయినట్లు ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు.

మరిన్ని వార్తలు