ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లిపై వివాదం
ముస్లిం మత పెద్దల అభ్యంతరం
జమ్ము కశ్మీర్, నవంబర్ 2: జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) రెండో వివాహంపై(Second Marriage) మతపరమైన వివాదం చెలరేగింది. ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్ను(Prominent journalist Nidhi Razdan) ఆయన ఇటీవల వివాహం చేసుకోవడంపై ముస్లిం మతపెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ షరియత్ చట్టం ప్రకారం నిఖా జరగాలంటే వధూవరులిద్దరూ తప్పనిసరిగా ముస్లింలై ఉండాలని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాహబుద్దిన్ రజ్వీ బరేల్వీ పేర్కొన్నారు.
ఒమర్ అబ్దుల్లా ముస్లిం అయినప్పటికీ, నిధి రజ్దాన్ ముస్లిం కాదని.. వివాహానికి ముందే ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించి ఉండాల్సిందని ఆయన తెలిపారు. మతం మారకుండా జరిగిన ఈ వివాహం ఇస్లామిక్ సూత్రాల ప్రకారం చెల్లదని (నజయజ్) ఆయన ఫత్వా జారీ చేశారు. కాగా ఒమర్ అబ్దుల్లా తొలి భార్య పాయల్ అబ్దుల్లాకు ఇటీవల సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేయగా, ఆయన అక్టోబర్ 30న నిధి రజ్దాన్ను వివాహం చేసుకున్నారు.