ఆదిలాబాద్‌లో ఇండస్ట్రియల్ కారిడార్

12-11-2026 | 05:35am

3 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తాం

ఐటీ, పారిశ్రామికంగా అగ్రగామిగా తీర్చిదిద్దుతాం 

త్వరలో విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు

ఆదిలాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): వెనుకబడిన ఆదిలాబాద్‌ను(Adilabad) ఐటీ, పారిశ్రామిక రంగాల్లో(IT and industrial sectors) అభివృద్ధి చేసి, స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Sridhar Babu) తెలిపారు. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రూ.58.85 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌ను ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. 

మంత్రి మాట్లాడుతూ.. నిధుల కొరతతో నిలిచిపోయిన ఐటీ టవర్ నిర్మాణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామన్నారు. యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లకుం డా స్థానికంగానే ఉపాధి పొందేలా ఐటీ సం స్థలను తీసుకొస్తున్నామన్నారు. ఐటీ టవర్‌లో టాస్క్ శిక్షణ కేంద్రం, ఇంక్యుబేషన్ హ బ్ ఏర్పాటు చేశామని తెలిపారు.  మరిన్ని కంపెనీలు ముందుకు వస్తే ఆదిలాబాద్‌లో మరో ఐటీ టవర్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.

స్థానికులకు సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. త్వరలో ఆదిలాబాద్లో 3 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. విమానాశ్రయం ఏర్పాటుకు సీఎం ప్రత్యేక చొ రవ తీసుకుంటున్నారని, భూసేకరణ, అనుమతుల ప్ర క్రియను వేగవంతం చేసి త్వరలో శంకుస్థాప న చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు