బీజేపీపై పోరాటం చేస్తున్నది కాంగ్రెస్ ఒక్కటే

12-11-2026 | 05:40am

మోదీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యం

గల్లీ నుంచి వెళ్లిన కారు.. ఢిల్లీకి చేరగానే కమలంగా మారిపోతోంది..

మైనారిటీలకు 4 % రిజర్వేషన్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే

జాతీయ విద్యా దినోత్సవం-మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి

నవంబర్ 11 (విజయ క్రాంతి): బీజేపీపై(BJP) దేశంలో పోరాటం చేస్తు న్నది కాంగ్రెస్ పార్టీయేనని(Congress Party) , రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో మోదీని గద్దె దించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) చెప్పా రు. గులాంనబీ ఆజాద్(Ghulam Nabi Azad) నుంచి షబ్బీర్ అలీ వరకు కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ఎన్నో అవకాశాలను ఇచ్చిందని, మైనారిటీలకు 4 శాతం రిజ ర్వేషన్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని స్పష్టం చేశారు. మైనారిటీ రిజర్వేషన్‌ను(Minority Reservation) తొలగిస్తామని  చేవెళ్ల సభలో బీజేపీ ప్రకటించిందని, ముందు గుజరాత్‌లో తొలగించి చూపించాలని తాము సవాల్ విసిరామని తెలిపారు.

మైనారిటీల సంక్షేమమే తమ బాధ్యత అని పేర్కొన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి స్వాతంత్య్రం కోసం పోరాడిన చరిత్ర లేదని దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతమని స్పష్టంచేశారు. పేదలకు, మైనారిటీలకు కాంగ్రె స్ ఓటు హక్కు కల్పిస్తే బీజేపీ ఆ ఓట్లను తొలగించాలని చూస్తోందని మండిపడ్డారు. 12 ఏళ్లు గడిచినా మైనారి టీలకు 12 శాతం రిజర్వేషన్ హామీ బీజేపీ నిలబెట్టుకోలేదన్నారు. ఢిల్లీకి వెళ్లి మోదీ ముందు మోకరిల్లి సా గిలబడిందెవరో ప్రజలకు తెలుసని బీఆర్‌ఎస్ ఉద్దేశించి విమర్శించారు.

తెలంగాణ గల్లీ నుంచి వెళ్లిన కారు.. ఢిల్లీకి చేరగానే మోదీ కమలంగా మారిపోతోందని ఎద్దేవా చేశారు. బీజేపీతో పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. మైనారిటీ స్కాలర్‌షిప్‌లను తొలగించాలని బీజేపీకి ఏ దేవుడు చెప్పారని ప్రశ్నించారు. క్రీడల్లో దేశ ప్రతిష్టను పెంచిన మైనారిటీ క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతితో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి గౌరవించిందన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం అజారు ద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి గౌరవించామని, షబ్బీర్ అలీని సలహాదారులుగా నియమించినట్లు తెలి పారు. ప్రజా ప్రభుత్వంలో మైనారిటీలకు ఎన్నో అవకాశాలు కల్పించామన్నా రు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. 

బ్లూ కాలర్ జాబ్‌లకు ముప్పు లేదు

సాఫ్ట్‌వేర్ రంగంతోపాటు పలు విభాగాల్లో ఏఐతో ఉద్యోగాలు పోయే పరి స్థితి ఉందని, కానీ టెక్నాలజీ ఎంత పెరిగినా బ్లూ కాలర్ జాబులకు ఏఐతో ముప్పులేదని సీఎం రేవంత్ అన్నారు. నైపుణ్యం పెంచుకుంటే భవిష్యత్‌లో బ్లూ కాలర్ ఉద్యోగ అవకాశాలకు కొదవ లేదన్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ ఎడ్యు కేషన్, ఇరిగేషన్‌కు మొదటి ప్రాధాన్యత ఇచ్చారని, దేశంలో విద్యాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు తొలి విద్యా శాఖ మంత్రిగా మౌలానాఅబుల్ కలాం ఆజాద్‌కు బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు.

దేశంలో ఐఐటీలను ఏర్పాటు చేసి ఎంతో మంది ఇంజనీర్లుగా తయారయ్యేందుకు ఆజాద్ పునా ది వేశారని, దేశంలో విద్యాభివృద్ధికి ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించిన ఘనత అబుల్ కలాం ఆజాద్ సొంతమని కొనియాడారు. అబుల్ కలాం హయాంలోనే ఐటీఐలకు పునాది పడిందని, ఆ ఐటీఐలను మనం ఇప్పుడు ఏటీ సీలుగా అప్‌గ్రేడ్ చేసుకున్నామని తెలిపారు. నాణ్యమైన విద్య అందించా లన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తు న్నదన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని, సిటీని కాపాడుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఓల్డ్ సిటీలో మెట్రో పనులను వేగవంతం చేశామని, మూసీ పునరుజ్జీవంతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవం తీసు కొస్తామన్నారు. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.. మీ సంక్షేమం కోసం పనిచేస్తుందని భ రోసా ఇచ్చారు. చదువు ఒక్కటే మీ జీవితాలను మారుస్తుందని, పిల్లలను చదివించాలి.. నైపు ణ్యాన్ని అందించాలని పిలుపునిచ్చారు.

నిఖత్ జరీన్, సిరాజుద్దీన్ తరహాలో పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచిం చారు. నైపుణ్యం, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ఇందుకోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూని వర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. పిల్లలను చదివించాలని.. మీ సోదరుడిగా మీకు అండగా నేను ఉంటానని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. మీ సమస్యలను అర్థంచేసుకుని పరిష్కరించే బాధ్యత నాది అని ఆయన హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు