ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లా?
- కేసీఆర్‌ది రైతు సంక్షేమం.. రేవంత్‌ది రైతు సంక్షోభం
- మూడున్నర ఏళ్ల ముదనష్టపు పాలనను అంతమొందిస్తేనే రైతులకు మేలు
- ఇది దేవుడు ఇచ్చిన కరువు కాదు.. సీఎం రేవంత్ తెచ్చిన కరువు
- కాంగ్రెస్, బీజేపీ మంచి దోస్తులు
- బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రానికి పట్టిన అష్టమగ్రహాలు
- నిర్మల్ రైతుగర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నిర్మల్ నవంబర్ 11 (విజయక్రాంతి): కేసీఆర్(KCR) పాలనలో నిర్మించిన ప్రాజెక్టుల్లోని నీళ్లు ఈరోజు ఎత్తిపోసి ఉంటే తెలంగాణలో(Telangana) కరువు వచ్చేది కాదని.. కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కక్ష పెంచుకొని రైతులను కరువులో ముంచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. తెలంగాణలో బ్రహ్మాండమైన నీటి వనరులు ఉన్నా అవి ఎత్తిపోసే వ్యవస్థను చేపట్టకపోవడం వల్ల ఆంధ్రకు నీళ్లు పోయాయని, తెలంగాణ రైతులకు(Telangana farmers') మాత్రం కన్నీళ్లే మిగిలాయని ఆయన ధ్వజమెత్తారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన రైతు గర్జనలో.. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు దేవుడు తెచ్చిన కరువు కాదని, ఇది సీఎం రేవంత్ తెచ్చిన కరువని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ మోదీని ప్రసన్నం చేసుకుంటున్నారని.. కాంగ్రెస్, బీజేపీ మంచి దోస్తులని ఎద్దేవా చేశారు. ‘ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేని మూడున్నర ఏళ్ల కాంగ్రెస్ ముదనష్టపు పాలనను పాతర వేస్తేనే తెలంగాణకు మంచి రోజులు వస్తాయి’ అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన ఈ మహాసభకు పెద్దఎత్తున తరలివచ్చిన రైతులకు ముందుగా కేటీఆర్ అభివాదాలు తెలిపారు. సుమారు గంటసేపు మాట్లాడిన ఆయన.. కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన బేరీజు వేసుకొని రైతుల నుంచి సమాధానాలను రాబట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆలోచన కేసీఆర్‌కు నిర్మల్ నుంచే 1996లో వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ‘30 ఏళ్ల కింద తెలంగాణ ప్రాజెక్టుల కోసం కేసీఆర్ మదిలో ఆలోచనలు మెదిలాయి. అందులో భాగమే కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవం, దేవాదుల వంటి ప్రాజెక్టులు. వాటిని ప్రస్తుత ముఖ్యమంత్రికి సరిగ్గా ఉపయోగించుకునే సోయిలేదు’ అని ఆక్షేపించారు. గోదావరి నదిపై పట్టి సీమ కంటే ముందున్న కాళేశ్వరంలో 1000 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్న సీఎం.. కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోసి ఉంటే రైతులకు ఈ కరువు వచ్చేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువులకు జీవంపోసిన విషయం గుర్తుచేశారు. రైతులను రాజు చేయాలన్నది కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షే మ పథకాలను బంద్ చేసి రైతు గోస పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో రూ. 300 కోట్ల నీటి పన్నును రద్దు చేశామన్నారు. కాళేశ్వరం నుంచి పునర్జీవ పథకం ద్వారా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్సారెస్పీకి నీళ్లు ఇచ్చింది కేసీఆర్ కాదా అని రైతులను అడిగారు. సింగరేణికి జీవం పోసి అక్కడ ఉత్పత్తి ఐన బొగ్గుతో రాష్ట్రం లో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఉత్పత్తి చేసి సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎన్ని గంటల కరెంటు ఇస్తు న్నదని, అది ఎన్నిసార్లు పోతున్నదని రైతులను అడిగారు. రైతులకు 12వేల పెట్టుబడి సాయం ఏమైందని, ఐదు లక్షల రైతు బీమా పోయిందని, పంట కొనుగోళ్లపై బోనస్ బోగస్ అయిందని, మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని, మహిళలకు 2500 పెన్షన్ ఎప్పుడు వస్తుందని, నిరు ద్యోగ యువతకు ఉద్యోగాలు ఏమయ్యాయని, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష 16 వేలతో పాటు తులం బంగారం వచ్చిందాఅని ప్రశ్నించారు. యూరియా కోసం ఇప్పుడు రైతులు చెప్పులు పెడుతున్నారని, ఇవన్నీ రేవంత్ రెడ్డి సంక్షోభ పాలనకు నిదర్శనం కాదా అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు ఒక్కనాడు అయినా నిలిచిపోయిందా, రైతు మరణిస్తే రైతు బీమా రాలేదా, పింఛన్‌దారులకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వలేదా, ప్రాజెక్టులు కట్టి పొలాలకు నీళ్లు ఇవ్వలేదా, ఇన్ని చేసిన కేసీఆర్ పాలనే రావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని ఈ తుఫా న్లో రేవంత్ రెడ్డి సర్కార్ కొట్టుకపోవడం ఖాయ మన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వరు కరెంటు ఇవ్వరు పండిన పంట కొనరు, కరువు వచ్చిన ఆదుకోరు. అందుకే రాష్ట్రంలో తెలంగాణ రైతుల ఆత్మహత్యలు మళ్లీ పెరిగాయని అన్నారు. కానీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌కు మాత్రం వెళ్లి వరాల కురిపిస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రజలు తిరస్కరిస్తున్నారని కలుపు మొక్కల కాంగ్రెస్ పార్టీలో కల్లోలం తప్ప సంక్షేమం లేదన్నారు. ప్రస్తుతం ఏ ఎన్నికలు లేవని, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రైతులు, ప్రజలకు జరుగుతున్న అన్యా యాలను ఎండగట్ట్టేందుకే రైతు గర్జన చేపట్టినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్, కేటీఆర్‌లను తిట్టడం తప్ప ఈ ప్రజల సంక్షేమం గురించి తెలవదని అన్నారు. ‘ఇటీవల ముఖ్యమంత్రి ఓ సభలో మాట్లాడుతూ, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నేను ఆయనలాగా గడ్డం పెంచుతున్నానట. అన్ని వర్గాల ప్రజలు తిడుతున్న రేవంత్‌రెడ్డిని చూసి ఎవరైనా అనుకరిం చాలి అనుకుంటారా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
పెట్టుబడి సాయం అందించాలి
ఇప్పటికైనా రేవంత్‌రెడ్డికి రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా పెట్టుబడి సాయం అందించాలని, రెండు లక్షల రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయాలని, రైతుబీమా అమలు చేయాలని, కరు వు మండలాల్లో నివారణ చర్యలు చేపట్టాలని, ఉపాధి కూలీలకు ఇస్తామన్న వెయ్యి రూపాయల నగదును జమ చేయాలని డిమాండ్ చేశారు.
అష్టగ్రహాలు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు
రాష్ట్రానికి పట్టిన అష్టగ్రహాలు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలేనని కేటీఆర్ ఘాటుగా విమర్శిం చారు. తెలంగాణలో బీజేపీకి ౮ మంది ఎమ్మెల్యేలు, ౮ మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏనాడూ గట్టిగా ప్రశ్నించిన దాఖలాలు లేవని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ప్రజాప్రతినిధులు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
ఉద్యమానికి బీజం పడింది నిర్మల్‌లోనే..
తెలంగాణ ఉద్యమానికి నిర్మల్ గడ్డపైనే బీజం పడిందని కేటీఆర్ గుర్తుచేశారు. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ మంత్రిగా ఉండగా, నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఆ సమయంలోనే తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతపై ఆలోచన ప్రారంభించారని వివరించారు. అప్పట్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన కేసీఆర్.. తెలంగాణకు చెందిన నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోతున్న తీరును చూసి ఆవేదన వ్యక్తం చేశారని గుర్తుచేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతో ఉద్యమానికి బీజం పడిందన్నారు. ఏదో ఒక రోజు తెలంగాణకు మంచి రోజులు వస్తాయని, వెలవెలబోయిన ప్రాజెక్టులు జలకళతో కళకళలాడుతాయనే ఆశయంతో ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైందని పేర్కొన్నారు. చదువుల తల్లి సరస్వతి కొలువైన బాసరతో పాటు చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిర్మల్ జిల్లా ప్రత్యేక గుర్తింపు కలిగి ఉందన్నారు. నిర్మల్ కొయ్యబొమ్మలు, చిత్రకళకు ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు ఉన్నాయని, ఇక్కడి కళాకారుల ప్రతిభ దేశవిదేశాల్లో గుర్తింపు పొందిందని కొనియాడారు.
కొమురం భీం పోరాట స్ఫూర్తిని చాటిన ఈ ప్రాంతం ఉద్యమాలకు నిలయమని పేర్కొన్నారు. నిర్మల్ ప్రజలు నిర్మలమైన మనసుతో కేసీఆర్‌ను ఆదరించాలని, మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు అండగా నిలవాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కేటీఆర్ నిర్వహించిన రైతు గర్జనకు పెద్ద ఎత్తున రైతులు మళ్ళీ రావడంతో సభ విజయవంతం అయ్యింది. పట్టణమంతా గులాబీ తోరణాలతో కళకళలాడింది.