డీలిమిటేషన్ బిల్లుపై రాహుల్ ఘాటు విమర్శలు
న్యూఢిల్లీ: డీలిమిటేషన్ బిల్లు(Delimitation Bill)కు మద్దతు తెలుపుతున్న పార్టీల నేతలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Senior Congress leader Rahul Gandhi) విమర్శలు గుప్పించారు. డీఎంకే నుంచి శరద్ పవార్, సుప్రియా సూలే వరకు ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్న నాయకులు తమ రాష్ట్రాల ప్రజల హక్కులను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
మహిళా రిజర్వేషన్ల(Women Reservation Bill) పేరుతో ప్రస్తుత పురుష ఎంపీల స్థానాలను కాపాడేందుకు ప్రయత్నించడం మహిళలకు అన్యాయం చేయడమేనని రాహుల్ వ్యాఖ్యానించారు. మహిళలకు నిజమైన ప్రాతినిధ్యం కల్పించకుండా వారి పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని విమర్శించారు. డీలిమిటేషన్ ప్రతిపాదనలపై కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.