ప్రయాణికులకు తప్పని తిప్పలు
అమెరికాలో విమానయాన సంక్షోభం.. వేలాది సర్వీసులు రద్దు, ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
అమెరికా ఆకాశంలో గందరగోళం
అమెరికా: అగ్రరాజ్యం అమెరికాలో విమాన ప్రయాణాలు గందరగోళంగా మారాయి. Air Traffic Control (ATC) వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్యతో దేశవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం మొదలైన ఈ సమస్య వారాంతం వరకు కొనసాగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాల రద్దు, ఆలస్యాలతో ప్రధాన Airportsలో రద్దీ పెరిగింది.
ఆదివారం ఒక్కరోజే సుమారు 8,800 విమానాలు ఆలస్యంగా నడవగా.. మరో 2,400 సర్వీసులు రద్దయినట్లు సమాచారం. విమానాలతో పాటు Pilots, ఇతర సిబ్బంది కూడా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోవడంతో Flight Schedules తిరిగి గాడిలో పడటం కష్టంగా మారింది. పరిస్థితులు పూర్తిగా చక్కబడటానికి సోమవారం వరకు సమయం పట్టవచ్చని అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ వెల్లడించారు.
రూటర్లో లోపంతో కుప్పకూలిన నెట్వర్క్!
ATC సిబ్బంది, పైలట్ల మధ్య సమాచార మార్పిడికి ఉపయోగించే కీలక వ్యవస్థలోనే సాంకేతిక వైఫల్యం తలెత్తినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వ్యవస్థ ఆధునికీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన Computer Router నుంచి తప్పు సంకేతాలు వెలువడటంతో నెట్వర్క్పై ప్రభావం పడినట్లు మంత్రి డఫీ వివరించారు. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి Investigation చేపట్టారు. విమానయాన రంగంలో ఏర్పడిన సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) స్పందించారు. దేశంలోని Air Traffic Control Infrastructureను ఆధునికీకరించేందుకు కాంగ్రెస్ వెంటనే నిధులు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం వినియోగిస్తున్న వ్యవస్థలోని కీలక పరికరాలు దాదాపు 50 ఏళ్ల నాటివని, వాటి స్థానంలో ఆధునిక Technology తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనతో అమెరికా విమానయాన వ్యవస్థలోని పాత సాంకేతికతపై మరోసారి చర్చ మొదలైంది.