ట్రావెలర్స్‌కు బంపర్ ఆఫర్లు!
గురుగ్రామ్: తమ సంవత్సరాంతపు సెలవులను ప్లాన్ చేసుకుంటున్న ప్రయాణికుల కోసం, ‘ట్రావెల్ కా ముహూరత్ సేల్(Travel Ka Muhurat Sale)’ రెండో ఎడిషన్ నవంబర్ 14 నుండి ప్రారంభం కానున్నట్లు మేక్ మై ట్రిప్(MakeMyTrip) ప్రకటించింది. ఇందులో పాల్గొంటున్న భాగస్వాములలో హోటల్ చైన్‌లు, రిసార్ట్‌లు, స్వతంత్ర హోటళ్లు, హోమ్‌స్టే లు, విల్లాలతో సహా 30,000కు పైగా దేశీయ, 3500కు పైగా అంతర్జాతీయ వసతి కేంద్రాలు, 35 దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, 8 బ్యాంకులు ఉన్నాయి. (నవంబర్ 11, 2026 నాటికి) సంవత్సరాంతపు ప్రయాణాలలో తరచుగా ధరల ఆందోళన ఉంటుంది.
ఎందుకంటే డిసెంబర్‌లో పెరిగే ధరలు, పరిమిత లభ్యత గురించి ప్రయాణికులు ఆందోళన చెందుతారు. ‘ట్రావెల్ కా ముహూరత్ సేల్’ వారికి ముందు గానే ప్లాన్ చేసుకోవడానికి, విశ్వాసంతో బుక్ చేసుకోవడానికి ఒక ప్రత్యేక బుకింగ్ విండోను అందిస్తుంది. ఇందులో విమానాలు, హోటళ్లు, హోమ్‌స్టేలు, హాలిడే ప్యాకేజీలు, బస్సులు, క్యాబ్‌లు, రైళ్లు, టూర్స్ అండ్ అట్రాక్షన్స్, ఫారెక్స్, వీసా సేవలపై డీల్స్ ఉంటాయి. ఈ ఆఫర్లు కూర్గ్, అండమాన్, లక్షద్వీప్, జమ్మూ & కశ్మీర్, కేరళ, రాజస్థాన్, ఈశాన్య ప్రాంతం, గోవా వంటి దేశీయ ప్రసిద్ధ ప్రదేశాల నుండి, జపాన్, దుబాయ్, మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం, శ్రీలంక, యూకే, మిగిలిన యూరప్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాల వరకు స్వల్ప, సుదూర ప్రయాణాలను కవర్ చేస్తాయి.
ఫెరారీ వరల్డ్ (యూఏఈ), యూనివర్సల్ స్టూడియోస్ (సింగపూర్), మేడమ్ టుస్సాడ్స్ (సింగ పూర్), మందాయ్ వైల్డ్‌లైఫ్ గ్రూప్ – నైట్ సఫారీ, సింగపూర్ జూ (సింగపూర్), సన్ వరల్డ్ బా నా హిల్స్ (వియ త్నాం) వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ ఆకర్షణలు కూడా ఈ ప్రచార కార్యక్రమం కోసం చేతులు కలిపాయి. మేక్ మై ట్రిప్ లాయల్టీ ప్రోగ్రామ్ MMTBLACK సభ్యులు నవంబర్ 13న జరిగే ఎర్లి సేల్ కు ముందస్తు యాక్సెస్ పొందుతారు. ప్రతి శుక్రవారం, ఈ క్యాంపెయిన్ ప్రత్యేకంగా MMTBLACK సభ్యుల కోసం బ్లాక్ ఫ్రైడే డీల్స్‌ను అందిస్తుంది. రోజువారీ లైట్నింగ్ డ్రాప్స్ సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్య అందరు వినియోగదారుల కోసం పరిమిత ఇన్వెంటరీ డీల్స్‌ను విడుదల చేస్తాయి.