11 July, 2026 | 12:48 PM

దేశ అభివృద్ధికి జనాభా నియంత్రణ అవసరం

11-07-2026 11:29 AM

ర్యాలీని ప్రారంభించిన డిఎంహెచ్ఓ 

జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్

కామారెడ్డి, జూలై 11 (విజయక్రాంతి): దేశ అభివృద్ధికి జనాభా నియంత్రణ ఎంతో అవసరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్ అన్నారు. శనివారం కామారెడ్డిలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలో ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ అత్యంత అవసరమని ప్రతి ఒకరు గ్రహించాలని సూచించారు. ప్రజల కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకే ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.

చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని గ్రహించాలన్నారు. చిన్న కుటుంబం ద్వారా ఆరోగ్యకరమైన ఆర్థికంగా బలమైన సంతోషకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని  అన్నారు. ఈ కార్యక్రమం కామారెడ్డి సిరిసిల్ల రోడ్డు లోని రైల్వే స్టేషన్ నుంచి ప్రభుత్వాసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజు, డాక్టర్ వెంకటస్వామి, జిల్లా ఆరోగ్య విద్య బోధకులు వేణుగోపాల్, చలపతి, ఆరోగ్య విస్తీర్ణ అధికారి ఠాగూర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పద్మజ, సాలమ్మ, స్టాటిస్టికల్ ఆఫీసర్ నయీమ్, సుధాకర్, రమేష్, శ్యామల, నవీన్, రవీందర్, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.