19 April, 2026 | 12:56 PM

గోండు సంగీతం పెప్రె

18-12-2024 12:00 AM

ఇది సన్నాయి వాద్యం. మంగళ శబ్దం పలుకుతుంది. దీనిని ప్రధాన్‌లే వాయిస్తారు. ఇద్దరు కళాకారులు కలిసి జంటగా వాయిస్తారు. పెద్ద ఏగి చెట్టుకర్రతో మూరెడు పొడవు ఉండే విధంగా నరికి దీనిని తయారుచేస్తారు. పెప్రె మొదలు, చివర భాగాలు ఇత్తడితో తయారుచేసి అమరుస్తారు. పెళ్లిళ్లలో, దేవతల కొలుపులలో దీనిని వాయిస్తారు. దీని సంగీత శబ్దం శరారీన్ని పులకరించేలా చేస్తుంది. ఎంతో మధురంగా ఉంటుంది. దీనికి ఒక పీక అమర్చి ఉంటుంది. పీకను కూడా ఇత్తడితో చేస్తారు. దీని దగ్గర బలంగా ఊదుతారు. వేళ్లతో రంధ్రాలను మూస్తూ తెరుస్తుండటం వల్ల సంగీతం పలుకుతుంది. ఆదివాసీలు, జానపదులు, శిష్టులు కూడా ఇష్టపడే వాద్యం ఇది.