14 March, 2026 | 6:13 AM

బతుకు జీవుడా అంటూ..

14-03-2026 02:16 AM

ఒకరోజు జవహర్‌నగర్ హౌజింగ్ సొసైటీ అధ్యక్షులు ముత్యంరెడ్డి గారు ఫోన్ చేసి ‘సార్! మీరు మా హౌజింగ్ సొసైటీ ఆవరణలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాలి’ అని అభ్యర్థించా రు. నేను సరే అన్నాను. మహిళా దినోత్స వం మార్చి 8వ తేదీన ఉంటుంది. కానీ, వారు 6వ తేదీ నాడే నిర్వహించాలనుకున్నారు.

ఈ కార్యక్రమం గురించి నాకు సుమారు రెండు నెలల ముందుగానే సమాచారం ఇచ్చారు. నా బయోడేటాను కావా లని అడిగితే వాట్సాప్ ద్వారా పంపించాను. కార్యక్రమానికి ఒక వారం ముందు జాగృతి మహిళా మండలి’ అధ్యక్షురాలు ఫోన్ చేసి.  ‘మీరు కార్యక్రమానికి వస్తున్నందుకు ఆనందంగా ఉంది సార్! మీకు ఆహ్వానం పంపడా నికి నేను, ముత్యంరెడ్డి గారు ఇద్దరం మీ ఇం టికి వస్తున్నాం’ అని తెలియజేశారు. ‘ఎందుకండీ కష్టం? వాట్సాప్‌లో ఆహ్వానం పంపితే చాలు’ అని తిరిగి సమాధానమిచ్చాను.

నేను ఆమెకు ఇదివరకే తెలుసు. కాని.. ఆమె తెలియనట్లు అడుగుతున్నట్లు అనిపించింది. నేను ‘టాస్కా’ (తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్)కు కార్యనిర్వాహక సలహాదారుగా ఉన్నాను. ఎలక్షన్ ఆఫీసర్ ఉండి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడంలో సహకారం అందించినవాణ్ణి. ఆమె మహిళా మండలి అధ్యక్షురాలు కూడా టాస్కాకు కా ర్యదర్శిగా ఎన్నుకోబడింది.

ఈ ఎన్నిక ప్రక్రియలో నేను, ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఒక పదవిలో ఉండి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు ప్రజాస్వామ్యబద్ధంగా, బాధ్యతతో పనిచేయాలి. కానీ ఆమె బాధ్యతారాహిత్యం అడుగడుగునా కనిపించింది. ‘మీ గురించి నేను అడిగి తెలుసుకున్నాను క దా! నా గురించి కూడా తెలుసుకొని సభలో మాట్లాడాలి సార్’ అని నన్ను ఒక రకంగా ఆజ్ఞాపిస్తూ మాట్లాడింది. తన గురించి చెప్పింది. 

మార్చి 6వ తేదీ వచ్చింది. నేను సోషల్‌మీడియాలో వారు పెట్టిన ఆహ్వానం చూశా ను. అందులో ముఖ్యఅతిథి స్థానంలో నేను లేను. నన్ను విశిష్ట అతిథి స్థానానికి మార్చేశారు. అది ఆహ్వానమా, కార్డు ముక్కనా? అనిపించింది. ఆ ఆహ్వానంలో ఒక అమ్మా యి ఫోటో వేశారు.

ఆమె డాక్టర్ సీహెచ్ ప్రీతి రెడ్డి గారు. ఆమె ఫోటో కింద ‘ప్రఖ్యాత డాక్టర్, మల్లారెడ్డి హెల్త్ సిటీ, వైస్ చైర్మన్ మల్లారెడ్డి యూనివర్సిటీ’ అని రాసి ఉంది. అప్పుడు తెలిసింది నాకు, శ్రీమతి ప్రీతిరెడ్డి గారు ప్రస్తుత ఎంఎల్‌ఏ గారైన మల్లా రెడ్డి గారి కోడలని. నాకు చాలా సంతోషం, ఆమె ను ముఖ్య అతిథిగా పిలవడం. మహిళా దినోత్సవానికి మహిళలనే ముఖ్య అతిథిగా పిలవడం వెనుక ఒక ఔచిత్యం ఉంది. ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్య అతిథులను పిలవడం చా లా బాగుంటుంది కూడా.

మలక్‌పేటలో ఉ న్న వికలాంగుల (దివ్యాంగుల) ఆవాస కేంద్రం వారు జరిపే కార్యక్రమాలకు నేను వికలాంగుణ్ణి కాకపోయినా, ఒక రకంగా పాల్గొనే వాణ్ణి. కానీ ఎవరో ప్రముఖ స్థానం లో ఉన్న ఒక అధికారిని లేదా రాజకీయ నాయకుణ్ణి (వికలాంగుడై ఉండాలి) ముఖ్య అతిథిగా పిలిచేవారు. ఇది నాకెంతో నచ్చిం ది. ఇక్కడ మహిళా మండలి వారు మహిళా దినోత్సవంలో నన్ను ఎందుకు ముఖ్య అతిథిగా రమ్మని మొదట చెప్పి, తర్వాత తనకంటే మరొక మహిళను ముఖ్యఅతిథిగా పిలిచారో అర్థం కాలేదు. సంఘంలో వెనక ముందు ఆలోచించకుండా చేసే పనులు ఇలాగే ఉంటాయేమో మరి. 

 ‘వయసు మీరిన వేళ వచ్చునా తెలివి?’ అని బాలచంద్రుడు పల్నాటి వీర చరిత్రలో వృద్ధులతో పలిసిన పలుకులు నాకీ సందర్భంగా జ్ఞాపకానికి వచ్చాయి. నేను సభా స్థలికి ఉదయం పదకొండు గంటలకల్లా చేరుకున్నాను. మిత్రులు ముత్యంరెడ్డి గారు స్వాగతం చెప్పారు. సభా స్థలిలో నన్ను కూర్చోబెట్టి సొసైటీ కార్యదర్శిని నాకు జత కలిపారు. అందులోనే జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళమిచ్చి అందమైన భవనం రూపొందించడానికి కారణమైన నా ప్రియ మిత్రులు నాకోసమని వచ్చారు. వారి పేరు గుడిగంటల రాములు. భగవద్గీతను ఔపోషనం పట్టినవారు. ఇంజినీర్‌గా వ్యవహరిం చినప్పటికీ ఆయన ఒక సాహిత్యవేత్త.

కేవలం సాహిత్యవేత్త మాత్రమే కాదు, ధన సంపాదనలో సింహభాగం విద్యార్థులకు, స్వచ్ఛంద సంస్థలకు, నిరుపేదలకు వయోవృద్ధులకు దానం చేసినవారు, చేస్తున్నారు. నాతో కాసేపు ముచ్చటించి, నేనక్కడికి వచ్చినందుకు సంతోషాన్ని వెలిబుచ్చినారు. ఆరోగ్య రీత్యా ఎక్కువసేపు ఉండనందున వారితో కొద్దిసేపు మాట్లాడిస్తే బాగుంటుందని చెప్పగానే నిర్వాహకులా పనిచేశారు ముందుగా. నిజానికి గుడిగుంటల రాములు గారు మాట్లాడి వెళ్లిన తర్వాత బాగుండేది. చీఫ్ గెస్టు వచ్చిన తర్వాత, వేదిక మీద ఆసీనులమైన తర్వాత మాట్లాడి వెళ్లవచ్చుననుకొన్నా ను. కానీ, ఆ నాటి ముఖ్యఅతిథి జాడలేదు.

ఆమెను ఎదుర్కోవడానికి అధ్యక్షురాలు కొ ంతమందిని కోలాటం ఆడటానికి సిద్ధపరిచారు. పాపం కోలాటం ఆడే స్త్రీలు సుమారు 40 నిమిషాలు ముఖ్యఅతిథి కోసం ఎదురుచూసి అలిసిపోయారు. అప్పటికి సమయం పన్నెండున్నర అయ్యింది. నాలో అసహనం కలిగింది. ఎవరికి చెప్పకుండా సభాస్థలి నుం డి వెలుపలికి వచ్చి, పిలిచిన వారేమనుకుంటారో అని తిరిగి లోపలికి వచ్చి కూర్చు న్నాను.

సభల్లో ఆహ్వానించబడిన వారు ఎంతగొప్పవారైనా ఆలస్యంగా వస్తే, సమయానికి మొదలైన కార్యక్రమాల్లో భాగస్వాములు కావొచ్చు. అప్పుడు ఆలస్యంగా వచ్చే అతిథుల కోసం సమయం వృథా కాదు. అధ్యక్షు రాలు మహిళ, ముఖ్యఅతిథి మహిళయే. ముఖ్యఅతిథి ఒక రాజకీయ నాయకుని కోడలు. ఆమె కోసం గంటన్నర సమయం వృథా చేయడం ఎంతవరకు న్యాయం? ముఖ్య అతిథి సభలోకి ప్రవేశించగానే వేదిక మీదికి సరాసరి వచ్చేశారు.

అప్పుడు అధ్యక్షురాలు నన్ను రమ్మని పిలిచింది. నేను వెళ్లి వేదిక మీద కూర్చున్న తర్వాత సమయం లేదు కాబట్టి రెండు మూడు నిమిషాలు మాట్లాడమన్నారు. నేను ఐదు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు. ఆ తర్వాత ముఖ్య అతిథి కూర్చొని తన ప్రసంగాన్ని ముప్పది నిమిషాల పైన సాగించింది. ఆమె తన ప్రసంగంలో స్త్రీలకు సంబంధించిన మంచి విషయాలే ప్రస్తావించింది.

ప్రసంగానంతరం ముఖ్యఅతిథిని ప్రత్యేక ఆసనంలో కూర్చోబెట్టి సన్మానించారు. ఆ తర్వాత నాకు కూడా సన్మానం అని ప్రకటించారు. నేను కుర్చీలో కూర్చున్న తర్వాత కాసేపు ఆగమన్నారు. కారణం ఏమిటంటే ముఖ్యఅతిథితో మహిళలు నృత్యం చేయాలని కోరడం వల్ల ఆ కార్యక్రమం జరగడానికి నన్నాగమన్నారు. కానీ, ముత్యంరెడ్డి గారు పక్కనే ఉండి కావలసినవి అందించి సన్మా నం చేశారు. సన్మానం కాగానే ముత్యంరెడ్డి గారు భవనం కింది భాగంలో ఉన్న ఆఫీసులో భోజనం ఏర్పాటు చేశారు.

అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలి. నేను భోజనం చేస్తుంటే ఒకరిద్దరు వచ్చి ‘మీ ప్రసంగం వినలేకపోయాం. మాకు నిరాశ కలిగింది. మీరు చెప్పే విషయాలు స్త్రీలకు ఎంతో ఉపయోగకరమైనవి’ అని తమ స్పందనను తెలియజే శారు. నేను బదులుగా ఏమీ మాట్లాడకుం డా భోజనం ముగించుకొని, బ్రతుకు జీవు డా అని క్యాబ్ ఎక్కి ఇంటికి చేరుకున్నాను. ఇకముందు ఎప్పుడూ మహిళా దినోత్సవాలకు వెళ్లరాదని నిశ్చయించుకున్నాను.

 వ్యాసకర్త సెల్: 9885654381

---ఆచార్య మసన చెన్నప్ప