14 March, 2026 | 4:43 AM

పెన్షనర్ల బెనిఫిట్స్ వారి హక్కు!

14-03-2026 02:19 AM

ఒకవైపు డబ్బులు లేవని చెబుతూనే రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఆడంబరాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు, గ్లోబల్ సమ్మిట్లు, విదేశీ క్రీడాకారుల ప్రదర్శనల కోసం ప్రజాధనం ఖర్చవు తోంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు, గాంధీ విగ్రహానికి ఐదు వేల కోట్లు కేటాయించినప్పుడు పెన్షనర్ల బకాయిలకు డబ్బులు ఎందుకు ఉండవని మేం నిలదీస్తున్నాం. విద్యార్థినులకు స్కూటీల పం పిణీ వంటి పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో సర్కార్ సమాధానం చెప్పా లి. 

పెన్షనర్లకు ఇచ్చేవి బెనిఫిట్స్ కాదు.. అవి పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలు. ముఖ్యమంత్రి గారూ! ప్రజలకు మీ రు తప్పుడు సమాచారం ఇవ్వకండి. మొన్న ఒక సభలో మీరు మాట్లాడుతూ ‘రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీ గా ఉందని, ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, ప్రతి నెల వెయ్యిమంది సగటున రిటైర్ అవుతున్నారని, వారికి ఒక్కొక్కరికీ రూ.కోటి చొ ప్పున రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి వస్తుందని,  అయినా ఏదో ఒక రకంగా స మన్వయం చేసుకొని తాము ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నామని తెలిపారు. అయితే.. ముఖ్యమంత్రి గారూ.. సమాచార లోపంతో కావచ్చు, లేదా కావాలనే కావచ్చు కానీ, సీఎం మాట్లాడిన మాటల్లో అవాస్తవాలు ఉన్నాయి.

సీఎం మాటలను ప్రజలం దరూ విన్నారు. వారు మాట్లాడిన అవాస్తవం ఏమిటి అంటే.  మొదటిది రిటైర్ అ యిన ఉద్యోగికి ఇచ్చేవి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావు. అవి రిటైర్ అయిన ఉద్యోగికి రావలసిన  ‘రిటైర్మెంట్ బకాయిలు.’  రెండోది ప్రతి రిటైర్ అయిన ఉద్యోగికి ఇచ్చేది రూ.కోటి అ నేది అవాస్తవంజ.  ఒక్కొక్కరికి చిన్న ఉద్యోగి నుంచి మొదలుకొని గ్రూప్ 1 ఆఫీసర్ స్థా యి వరకు 35 లక్షల నుంచి 70 లక్షల వరకే జీపీఎఫ్ పొదుపులను బట్టి బకాయిలు ఉంటాయి. వాటిని సగటున చేసినట్లయితే ఒక్కొక్కరికీ రూ.50 లక్షల వరకు పెన్షన్ బకాయిలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వాస్తవాలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరు తున్నాం. ముఖ్యమంత్రి కూడా సరైన సమాచారం తెప్పించుకుంటే బాగుంటుంది. 

గ్రాట్యుటీ.. గుడ్ విల్ మాత్రమే

రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి 30 నుంచి 40 ఏళ్ల పాటు ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేస్తారు. ఆ సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా ప్ర భుత్వం ఇచ్చేది కేవలం గ్రాట్యుటీ మాత్రమే. ఈ మొత్తం కూడా గరిష్ఠంగా రూ.16 లక్షలకు మించి ఉండదు. మిగిలిన బకాయిలన్నీ పెన్షనర్లు తమ సర్వీసు కాలంలో పొదుపు చేసుకున్న సొమ్ములు మాత్రమే. జీపిఎఫ్ రూపంలో ఉద్యోగులు ప్రతి నెలా తమ బే సిక్ వేతనం నుంచి 6 శాతం నిధులను జమ చేసుకుంటారు.

తమ కష్టార్జితాన్ని రిటైర్ అయిన వెంటనే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. దీనిని ‘జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్’ అంటారు. ఇది పూర్తిగా ఉద్యోగుల సొంత డబ్బు అని, దీనికి ప్రభుత్వ ఖజానాతో సం బంధం లేదని పెన్షనర్లు వివరిస్తున్నారు. తమ సొమ్మును తాము తీసుకుంటుంటే ప్ర భుత్వం ఏదో భారీగా భరిస్తోందన్నట్లు చిత్రీకరించడం సరికాదని వారు భావిస్తున్నారు.

సంపాదిత సెలవుల పరిహారం

ఉద్యోగులు తమ సర్వీసు కాలంలో వా డుకోకుండా, మిగిలించుకున్న సెలవులకు బదులుగా వచ్చే సొమ్మును ‘లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్’ అంటారు. సాధారణ ప్రభుత్వ శాఖ ల్లో ఏడాదికి 30 రోజుల సెలవులు ఉంటా యి. ఉపాధ్యాయుల వంటి వెకేషన్ డిపార్ట్మెంట్లలో ఏడాదికి 6 రోజులు మాత్రమే ఇస్తారు. సెలవు రోజుల్లో కూడా ప్రభుత్వం కోసం పనిచేసినందుకు పరిహారంగా ఈ సెలవులను మంజూరు చేస్తారు. రిటైర్‌మెం ట్ సమయంలో ఈ మిగిలి ఉన్న సెలవుల ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తే చట్ట ప్రకారం కొంత మొత్తం చెల్లిస్తారు. ఇది కూడా ప్రభుత్వం అదనంగా ఇచ్చే ప్రయోజనం కాదు. ఉద్యోగుల హక్కుగా లభించే చెల్లింపు మాత్రమే. దీనిని కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద లెక్కగట్టి ప్రజల్లో సీఎం అపోహ లు సృష్టించడం సమంజసం కాదు.

కమ్యుటేషన్ అంటే..

కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ గురించి కూడా ప్రజల్లో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా ప్రభుత్వం అదనంగా ఇచ్చేది ఏ మీ కాదు. తమకు రావాల్సిన నెలవారీ పెన్ష న్ నుంచి 40 శాతాన్ని ముందుగానే అమ్ముకోవడాన్ని కమ్యుటేషన్ అంటారు. ఇలా అమ్ముకోగా వచ్చిన సొమ్మును ప్రభుత్వం 15 ఏళ్ల పాటు వడ్డీతో సహా పెన్షనర్ జీతం నుంచి రికవరీ చేస్తుంది. అంటే, ప్రభుత్వం దగ్గర పెన్షనర్లు అప్పు తీసుకున్నట్లే లెక్క. ఈ అప్పునకు దాదాపు 8 శాతం వడ్డీని ప్రభు త్వం వసూలు చేస్తోంది. తీసుకున్న అసలు కంటే రెట్టింపు మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకుంటోంది. రిటైర్ అయిన తర్వాత పిల్ల ల పెళ్లిళ్లు, గృహ అవసరాల కోసం ఈ వెసులుబాటును ఉద్యోగులు వాడుకుంటారు. ఇది ఒక రకంగా ప్రభుత్వం చేస్తున్న వ్యాపారమే తప్ప సాయమేమీ కాదు.

బీమా, ఇతర బకాయిల నిలిపివేత

గ్రూప్ ఇన్సూరెన్స్, తెలంగాణ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ రూపంలో కూడా ఉద్యోగుల వేతనం నుంచి ప్రతి నెల కోత ఉంటుంది. ఈ నిధికి సంబంధించి 2024 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయి న వారికి జీవోలు కూడా విడుదల కాలేదు. గడిచిన పీఆర్సీ 2020 బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. గత ప్రభు త్వం ఈ బకాయిలను రిటైర్‌మెంట్ సమయంలో ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం 2025 ఫిబ్రవరి వరకు రిటైర్ అయిన వారికి కొంత మేర చెల్లించినా, ఆ తర్వాత రిటైర్ అయిన వారిని పట్టించుకోవడం లేదు. డీఏ బకాయిలు, సరెండర్ లీవు ల డబ్బులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇవన్నీ న్యాయబద్ధంగా రావాల్సినవే తప్ప ప్రభుత్వాలు ఇస్తున్న దానధ ర్మాలు కావు.

సుప్రీంకోర్టు తీర్పులు 

సుప్రీంకోర్టు గతంలో అనేక సందర్భాల్లో పెన్షన్ గురించి స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. జస్టిస్ వైవీ చంద్రచూడ్ వంటి న్యాయకోవిదుడు పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని, అది ప్రభుత్వం వేసే భిక్ష కాదని నొక్కి చెప్పారు. రాజ్యాంగబద్ధంగా సంక్షేమ రాజ్యంలో విశ్రాంత జీవులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ, దురదృష్టవశాత్తు 2024 మార్చి నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలు అందకముందే 78 మంది పెన్షనర్లు మరణించారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, మానసిక ఒత్తిడి కారణంగా వారు అసువులు బాశారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని పెన్షనర్ల సంఘం ప్రశ్నిస్తోంది. తమ కష్టార్జితం కోసం వృద్ధాప్యంలో ధర్నాలు చేయా ల్సి రావడం పాలకులకే అవమానమకరం.

పెన్షనర్ల ఆవేదన

ఒకవైపు డబ్బులు లేవని చెబుతూనే రాష్ట్రప్రభుత్వం ఇతర ఆడంబరాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మిస్ వరల్డ్ పోటీలు, గ్లోబల్ సమ్మిట్లు, విదేశీ క్రీడాకారుల ప్రదర్శనల కోసం ప్రజాధనం ఖర్చవు తోంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు, గాంధీ విగ్రహానికి ఐదు వేల కోట్లు కేటాయించినప్పుడు పెన్షనర్ల బకాయిలకు డబ్బులు ఎందుకు ఉండవని మేం నిలదీస్తున్నాం. విద్యార్థినులకు స్కూటీల పం పిణీ వంటి పథకాలకు నిధులు ఎక్కడి నుం చి వస్తున్నాయో సర్కార్ సమాధానం చెప్పాలి.

ఇవన్నీ చేస్తున్న ప్రభుత్వం విశ్రాంత జీ వుల పట్ల కనికరం చూపకపోవడం బాధాకరం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని యాత్ర చేసినప్పుడు ఉద్యోగులందరూ అండగా నిలిచా రు. ఇప్పుడు అదే ప్రభుత్వం పెన్షనర్లను వేధిస్తోంది. ప్రస్తుత పరిస్థితి పెన్షనర్ల పట్ల క్షేమకరం కాదని, ఇది ప్రజా పాలన అనిపించుకోదని సంఘం పేర్కొంది. పెన్షనర్లకు వెంటనే పెండింగ్ బకాయిలను ఏక మొత్తం లో విడుదల చేయాలి. బెనిఫిట్స్ అందలేదన్న బాధలో మరో పెన్షనర్ మరణించ కూడదనేది మా అభిలాష.

 -వ్యాసకర్త: రిటైర్డ్ ఎంప్లాయిస్ 

అసోసియేషన్ బకాయిల 

సాధన కమిటీ నేత, సెల్: 99499 37745