calender_icon.png 12 July, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హర్షణీయం

12-07-2025 12:00:00 AM

కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి భీమ్ భరత్

చేవెళ్ల, జులై 11:స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం హర్షనీయమని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచా ర్జి భీమ్ భరత్ సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలో నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. బీసీ వర్గాలు రాజకీయకంగా ముందుకు వెళ్లేందుకు ఇది దోహపడుతుందన్నారు. అంతకుముందు హైదరాబాద్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి స్వీట్లు తినిపించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరి సతీష్ , మొయినాబాద్ మండల అధ్యక్షుడు మానయ్య , నేతలు గణేష్ , రాజు, బట్టు విఠల్ యాదవ్, బాల కృష్ణ రెడ్డి ,  మహేందర్ రెడ్డి, సత్యనారాయణ,  వీరభద్ర స్వామి, ఆర్మీ కుమార్, నిరంజన్ గౌడ్ ,  రాములు , మాధవ రెడ్డి , గణేష్, వెంకటరెడ్డి తదితరులుపాల్గొన్నారు.