12-07-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి, జూలై 11:శేరిలింగంపల్లి ని యోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్పల్లి బసవతారక నగర్ వాసులను బిఆర్‌ఎస్ పార్టీ నేతలు, మాజీ స్పీకర్ మధుసూ దనాచారి,ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ లు శుక్రవారం పరామర్శించారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకే బసవతారకనగర్ బాధిత కుటుంబాలను పరమర్శించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
రియల్ మాఫియా పెద్దలు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే బసవతారకనగర్ కాలనీ వాసులను ఖాళీ చేయించడానికి గుండాలను పంపుతున్నారని మండిపడ్డారు.
గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బసవతారక నగర్ కాలనీని సందర్శించి వారికి 60 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీకి కట్టుబడి ఉండాలని బిఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బసవతారక నగర్ పక్కనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. లేకపోతే బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామనిహెచ్చరించారు.