04-12-2025 09:46:43 AM
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్( Russian President Vladimir Putin) డిసెంబర్ 4 నుండి రెండు రోజుల పాటు భారత్ పర్యటనకు రానున్నారు. రేపు 23వ భారత్-రష్యా వార్సిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో(Prime Minister Narendra Modi) వార్షిక శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించనున్నారు. ఇది ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి గణనీయమైన ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు. అణు విద్యుత్ సహా పలు రంగాల్లో భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. ఈ పర్యటనను ప్రకటించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం భారతదేశం-రష్యా ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి దార్శనికతను నిర్దేశిస్తుందని తెలిపింది.