04-12-2025 02:00:00 AM
వర్ధంతిలో ప్రజాప్రతినిధులు, వక్తలు
ముషీరాబాద్/ఎల్బీనగర్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): మలిదశ తెలంగాణ ఉద్య మ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారిని తెలంగాణ సమాజం ఎన్నటికీ మర్చి పోదని ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. శ్రీకాంతాచారి 16వ వర్ధంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళులర్పించారు. ఎల్బీనగర్‌లో శ్రీకాంతాచారి విగ్రహానికి టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ పూల మాల వేసి నివాళులర్పించారు.
అంబర్‌పేట ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీకాంతాచారి విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఏసిపి కిరణ్ కుమార్, కాచిగూడ ఏసీపి హరీష్ లతో కలిసి ఆవిష్కరించారు. అంబర్‌పేట నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం చైర్మన్ నాగారం భాస్కర్ చారి, అధ్యక్షులు గుట్టాల వినోద్ చారి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ చారి తదితరులు పాల్గొన్నారు. చిక్కడపల్లిలోని పొలిటికల్ ప్రంట్ రాష్ట్ర కార్యాలయంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళు ర్పించారు.
బీసీ పొలిటికల్ ప్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, కన్వీనర్లు అయిలి వెంకన్నగౌడ్, యెలికట్టే విజయకుమార్‌గౌడ్, అంబాల నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్‌గౌడ్ ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి నివా ళులర్పించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ సెక్రటరీ బాలాచారి, బీసీ జేఏసీ కన్వీనర్ జాజుల లింగయ్య, జిల్లా అధ్యక్షులు ఇంద్రం రజక, రాష్ట్ర నాయకులు రవి కిరణ్, గోదా రవీందర్ పాల్గొన్నారు.
ఉద్యమ కాంక్షను రగిల్చిన శ్రీకాంతాచారి: హరీశ్‌రావు
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి త్యాగాన్ని తెలంగా మరువదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంతా చారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన బలిదానం కోట్లాది గుండెల్లో ఉద్యమ కాంక్షను రగిలించిందని గుర్తు చేసుకున్నారు. ‘శ్రీకాంతాచారీ... నీ పోరాటం, నీ త్యాగం వృధా కాలేదు.. తెలంగాణ సమాజం నిన్ను ఎప్పటికీ మరువదు’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.