26 May, 2026 | 12:58 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

ఇంటివద్దనే పురుడు పోసిన 108 సిబ్బంది

01-04-2026 12:32 AM

ఈఎంటీ సీతారాం వెల్లడి

మేడ్చల్ అర్బన్ మార్చి 31 (విజయక్రాంతి): పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి 108 అంబులెన్స్ సిబ్బంది ఇంటి వద్దనే పురుడు పోసినట్లు 108 అంబులెన్స్ ఈఎంటి సీతారాం వెల్లడించారు. మునీరాబాద్ కు చెందిన సమంజ సద భార్య ఆర్తి కుమారి వయస్సు (22)పురిటి నొప్పులతో బాధపడుతుంటే 108 అంబులెన్స్ కి ఫోన్ చేయడంతో గుండ్లపోచంపల్లికి చెందిన 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి సీతారాం,

పైలట్ అశోక్ హుటాహుటిన  చేరుకొని ఇంటి వద్దనే పురుడు పోశారు.ఈ నేపథ్యంలో ఆర్తి కుమారికి నొప్పులు అధికం అవ్వడంతో ఆసుపత్రికి వెళ్లే సమయం లేదని గమనించిన ఈఎంటి సీతారాం,ఈ.ఆర్.సి.పి డాక్టర్ స్మిత సూచనల మేరకు ఇంటి వద్దనే పురుడు పోసినట్లు చెప్పారు.బాధితురాలు ఆర్తి కుమారి అంబులెన్స్ సిబ్బంది సహకారంతో పండంటి ఆడబిడ్డకి ఉదయం 9:30 గంటలకు జన్మనిచ్చిందని చెప్పారు.

పురిటి నొప్పులతో బాధపడుతున్న బాధితురాలి బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారని 108 అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.బాధితురాలి కి డెలివరీ జరిగిన తర్వాత తదుపరి సంరక్షణ కోసం తల్లి బిడ్డలను దగ్గరలో ఉన్న మేడ్చల్ కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని 108 సిబ్బంది తెలియ జేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లి బిడ్డలను కాపాడినందుకు ఆర్తి కుమారి కుటుంబ సభ్యులు 108 సిబ్బంది ఈఎంటి సీతారాం తో పాటు పైలట్ అశోక్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు....