కెసిఆర్ చేసిన అక్రమాల వల్లనే కల్యాణ లక్ష్మి పథకం ఆగింది
బోథ్,(విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అక్రమాల వల్లనే కల్యాణ లక్ష్మి పథకాన్ని ఆపివేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పశుల చంటి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కథ ప్రభుత్వ సహాయంతో పంపిణీచేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంపైన శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలనుచూసి ఓరవలేక ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు.
అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల కోర్టు అసహనం వ్యక్తం చేసిందని కాగ్ రిపోర్టు ప్రకారం 72.91 కోట్ల అవినీతి జరిగిందని దాని కప్పిపుచ్చుకోవడానికి బిఆర్ఎస్ నాయకులు ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లాను ఉందన్నారు. కల్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం పారదర్శకంగా జవాబు దారితనంగా తీర్చిదిద్దుతూ అరులైన వారికి 30 రోజుల్లో అందే విధంగా రూపకల్పన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులకు దమ్ముంటే టిఆర్ఎస్ పార్టీ హయాంలో ఇచ్చిన చెక్కుల విషయంలో శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






