2 April, 2026 | 2:34 PM

Breaking News

మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   ప్రజా పాలన వార్డు సభలో ప్రజల ఆగ్రహం   •  

బల్కంపేట శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో గోపాల సునిత

02-07-2025 10:38 PM

ఆలయ బోర్డు సభ్యురాలు గోడాస్ ఉమారాణి ప్రత్యేక ఆహ్వానం

సనత్ నగర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన స్థానం ఉన్న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ తల్లి(Balkampet Yellamma Temple) కళ్యాణ మహోత్సవంలో గండిపేట ఎంపీటీసీ సభ్యురాలు గోపాల సునిత(MPTC Member Gopala Sunitha)  భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పవిత్ర రథోత్సవ కార్యక్రమంలో ఆమె హాజరై అమ్మవారి దివ్య దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి బల్కంపేట దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు గోడాస్ ఉమారాణి గోపాల సునితని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని, భక్తుల సేవకోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గోపాల సునిత మాట్లాడుతూ... “ఎల్లమ్మ తల్లి కళ్యాణం సమయంలో ఆలయంను దర్శించడం నాకు చాలా ధన్యతను కలిగించింది. రథోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించిన దేవాదాయ శాఖను, భద్రతా ఏర్పాట్లకు సహకరించిన పోలీసు అధికారులను అభినందిస్తున్నాను,” అని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు శాంతి, ఆరోగ్యం, సమృద్ధి కలగాలని వారు ఆకాంక్షించారు.