20-08-2025 02:10:59 AM
- జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం
-1971లో ఓయూ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా
-1995లో హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం
-2007లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి
-పదహారణాల తెలంగాణవాది
-గోవా రాష్ట్రానికి మొదటి లోకాయుక్తగా సేవలు
రంగారెడ్డి, ఆగస్టు 19(విజయక్రాంతి): ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డి(79) పేరును ఇండియా కూటమి ఖరా రు చేసింది. వీరిది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామం. వీరిది వ్యవసాయ కుటుంబం. ఈ న్యాయ కోవిదుడు తన కెరీర్‌లో ఎన్నో కీలక తీర్పు లు వెలువరించారు. మరెన్నో ఉన్నతమైన పదవుల్లో పనిచేశారు. 1946 జూలై 8న సుదర్శన్‌రెడ్డి జన్మించారు. హైదరాబాదులో నే చదువుకున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1971లో న్యాయశాస్త్రంలో ప ట్టా పొంది అదే సంవత్సరంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సీనియర్ న్యా యవాది కె. ప్రతాప్‌రెడ్డి ఛాంబర్‌లో జూనియర్‌గా పనిచేశారు. సిటీ సివిల్ కోర్టు, నాటి ఉమ్మడి ఏపీ హైకోర్టుల్లో వివిధ కేసుల్లో వా దనలు వినిపించారు. ఆగస్టు 8, 1988లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్, రెవెన్యూ శాఖ ఇన్‌ఛార్జిగా నియమితులై జనవరి 8, 1990 వరకు రెండేళ్ల పాటు సేవలం దించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా పనిచేశారు. 1993 జనవరి 8న ఉస్మానియా విశ్వ విద్యాలయానికి లీగల్ అడ్వైజర్, స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. పదహార ణాల తెలంగాణవాదిగా ఆయనకు పేరుంది.
హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం
1995 మే2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2007 జనవరి12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2011 జూలై 8న పదవీ విరమణ చేశారు. నాలుగున్నరేళ్లు సుప్రీం కోర్టులో పనిచేశారు. తన న్యాయప్రస్థానం లో పలు కీలక తీర్పులు ఇచ్చి ప్రత్యేక గుర్తిం పు తెచ్చుకున్నారు. పదవీ విరమణ తరువాత ఆయనను 2013లో గోవా రాష్ట్రానికి మొదటి లోకాయుక్తగా నియమించారు.
అయితే వ్యక్తిగత కారణాలతో ఏడు నెలల్లోనే ఆ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల 2024 డిసెంబర్ 14న హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మిడియేషన్ సెంటర్ (ఐఏఎమ్‌సీ) శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఇండియా కూటమి అతన్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఇదే సమయంలో ఎన్డీఏ తరఫున తమిళనాడుకు చెందిన మాజీ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పోటీలో ఉన్నారు. దీంతో రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇద్దరు దక్షిణాది నాయకుల మధ్య పోటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నెల 21న ఆయన నామినేషన్ వేయనున్నారు.