calender_icon.png 20 August, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమోద్ కుమార్ డాక్టరేట్ పొందడం అభినందనీయం

20-08-2025 02:00:47 AM

నాన్న స్వీపర్ కొడుకు డాక్టరేట్

నాన్న కష్టం చూసి కష్టపడి చదివాను

గరిడేపల్లి,(విజయక్రాంతి): ప్రమోద్ కుమార్ డాక్టరేట్ పొందడం అభినందనీయమని పలువురు గ్రామ పెద్దలు అన్నారు.మండలంలోని కల్మల్ చెరువు గ్రామానికి చెందిన అమరవరపు సైదులు కుమారుడు అమరవరపు ప్రమోద్ కుమార్ కు మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఇంజనీరింగ్ విభాగంలో డాక్టరేట్ అందుకోవడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు ఇంజనీరింగ్ లో డాక్ట రేట్ రావడం గర్వాంగా ఉందని అన్నారు. దళిత జాతిలో పుట్టిన నేను నాన్న గ్రామపంచాయతీ స్వీపర్ గా కష్టం చూసి కష్ట పడి చదివాను అని, గ్రామంలో అందరూ చూపించిన అభిమానం సంతోషం గా ఉందని ఆయన అన్నారు.