20-08-2025 01:56:22 AM
రోడ్డు ప్రమాదల నివారణకు చర్యలు తీసుకోవాలి
నెలవారి నీడ సమీక్ష సమావేశంలో ఎస్పీ
నల్గొండ క్రైమ్: జిల్లాలో పెండింగ్ కేసు లేకుండా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో విచారణ పూర్తి చేయాలిని,జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలిని,ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలిని సూచించారు.
ప్రతి కేసు లో విచారణ పూర్తి పారదర్శకంగా చేయాలి అన్నారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అన్నారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.. ప్రతి అధికారికి సి.సి.టి.యన్.ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విచారణ, స్టేషన్ నిర్వహణ తెలిసి ఉండాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.కేసుల సంఖ్య తగ్గించేందుకు అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. గ్రామ పోలీసు అధికారులు ప్రతీ రోజు గ్రామానికి సందర్శించి ప్రజలతో మమేకం అవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలని అన్నారు.కమ్మునిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవిలు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజల కు అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లైతే 1930కు, యన్.సి.ఆర్.పి. https://www.cybercrime.gov.in/ పోర్టల్ నందు ఫిర్యాదు నమోదుపై అవగాహన కల్పించాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృ ష్టి సారించాలని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లు గా గుర్తించి, సైన్ బోర్డు లను ఏర్పాటు చేయించాలని,హైవే రోడ్లను కలుపుతూ ఉండే లింకు రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్ వేయించడం, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించాలని,రోడ్డు ఇంజనీరింగ్ లో లోపాలున్నట్లయితే నేషనల్ హైవే స్టేట్ హైవే అథారిటీ, సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణ కృషి చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కల్పించాలని కోరారు.
విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని, దొంగతనాలు జరగకుండా పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు.మళ్ళీ దొంగతనాలకు పాల్పడితే గ్యాంగ్ కేసులు నమోదు చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయిని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,క్రయ విక్రయాల పైన,జూదం,పి.డి.యస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగలను జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వినాయక ప్రతిమను ప్రతిష్టించదలచినవారు ముందస్తుగా జిల్లా పోలీసులకు ఆన్లైన్ https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆడిషనల్ ఎస్పీ జి. రమేష్ ఉత్తమ సేవ, RSI అశోక్ మహోన్నత సేవా పథకం,యస్.ఐ ఖాలీలుల్ల ఖాన్, ఏ.ఎస్.ఐలు వెంకట్ రెడ్డి, రవి ప్రసాద్, ఏ.ఆర్.యస్.ఐలు యాదగిరి రెడ్డి,రవి కుమార్ హెడ్ కానిస్టేబుల్ మోహన్ రావు,గోవర్ధన్ రెడ్డిలకు సేవా పతకాలు అందజేసి అభినందించారు.