20-08-2025 01:55:53 AM
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 21న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నామి నేషన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో రాష్ట్రం నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ నేతలు కూ డా హాజరుకానున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన సుదర్శన్‌రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలుపించుకోవాల్సిన బాధ్యత ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారందరిపై ఉందని, పా ర్టీలకు అతీతంగా ముందుకు రావాలని సీ ఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే ఇం డియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సు దర్శన్‌రెడ్డి ఎంపికలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిదే కీలకపాత్ర అని కాంగ్రెస్ వర్గాలు చె బుతున్నాయి.
ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించడానికి ఒకరోజు ముందే సుదర్శన్‌రెడ్డితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ దక్షిణాధిలోని తమిళనాడుకు చెందిన వ్యక్తి కావ డంతో.. ఇండియా కూటమి నుంచి కూడా దక్షిణాది నుంచే ఎంపిక చేశారని చెబుతున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు విష యంలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మద్దతుగా ఉం డటమే కాకుండా ప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందించారని పార్టీ నేతలు పేర్కొం టున్నారు.