calender_icon.png 20 August, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిఫ్ట్ అడిగి దోపిడికి పాల్పడిన భార్య భర్తల అరెస్టు

20-08-2025 01:50:28 AM

కామారెడ్డి,(విజయక్రాంతి): లిఫ్ట్ అడిగి దోపిడీకి పాల్పడిన భార్యాభర్తలను కామారెడ్డి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్న భార్య భర్తలు ఇద్దరు డబ్బులు సులువుగా సంపాదించాలని భావించి భార్యతో లిఫ్ట్ అడిగించి దోపిడికి పాల్పడడం వృత్తిగా మలుచుకున్నారు.

ప్యారడైజ్ హోటల్ లో పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి బైక్ పై వెళుతుండగా మహిళా లిఫ్టు అడిగి ఎక్కి ఎస్ఆర్ గార్డెన్ వరకు వెళ్లగానే తన భర్తకు ఫోన్ చేసి బైక్ పై వెళుతున్న వ్యక్తిని ఆపి అతని వద్ద ఉన్న రెండు వేల నగదు, సెల్ ఫోన్ చేసి చంపుతామని బెదిరించి పారిపోయారు. పట్టణ సిఐ నరహరి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను పరిశీలించి చోరీకి పాల్పడ్డ భార్య భర్తలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 600 నగదు, సెల్ ఫోను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు.