20-08-2025 01:48:02 AM
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా కూల్చివేసిన ఇళ్ల మట్టి వ్యర్ధాలను తొలగించే ప్రక్రియను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రాజన్న ఆలయ నుంచి మూల వాగు వంతెన వరకు ప్రధాన రహదారి 47 కోట్లతో వెడల్పు పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు..మట్టి వ్యర్ధాలు తొలగింపు పూర్తికాగానే వేములవాడ పట్టణ ప్రజలు రాజన్న భక్తుల ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోడ్డు పనులు పూర్తి అవుతాయని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు.