calender_icon.png 20 August, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ స్లాబ్ రద్దు పేరిట కేంద్రం గొప్పలు

20-08-2025 02:02:27 AM

  1. కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
  2. చెక్ డ్యామ్ ఎందుకు కూలిందో కాంగ్రెస్ జవాబివ్వాలె
  3. శాంతిభద్రతలపై నిమ్మకు నీరెత్తినట్లుగా సర్కారు వ్యవహారం

హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి) : జీఎస్టీలోని 12 శాతం స్లాబ్‌ను రద్దు చేసి, పేద, మధ్యతరగతి ప్రజలకు ఏదో మేలు చేస్తున్నట్లు కేంద్రం ప్రచారం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో కేంద్రానికి కేటీఆర్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ఇది ప్రజలను మభ్యపెట్టే మ రో “జుమ్లా” తప్ప మరొకటి కాదని విమర్శించారు.

మొత్తం జీఎస్టీ పరిధిలోని 22 లక్షల కోట్లకు పైగా వచ్చే ఆదాయంలో ఈ 12 శాతం స్లాబ్ వాటా కేవలం 5 శాతం మాత్రమేనన్నారు.  నామమాత్రపు వాటా ఉన్న స్లాబ్‌ను రద్దు చేసి, అందులోని వస్తువులను వేరే స్లాబుల్లోకి మార్చి ప్రజలందరినీ ఉద్ధరించినట్లు మోదీ ప్రభుత్వం చెప్పుకోవడం హాస్యాస్పదంగా కనిపిస్తుందన్నారు. నిత్యావసరాలపై జీఎస్టీ విధించి సామాన్యుడి నడ్డి విరిచారని గుర్తుచేశారు.

ట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను అడ్డగోలుగా పెంచి లక్షల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. ఈ పాపాలను కప్పిపుచ్చుకోవడా నికే ఇప్పుడు స్లాబ్ రద్దు అంటూ  ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 2014 నాటి స్థాయికి పడిపోయినా, దేశంలో మాత్రం పెట్రో ధరలు మాత్రం రికార్డు స్థా యిలోనే ఉన్నాయన్నారు.

చేనేత ఉత్పత్తులు, జీవిత బీమా, ఆరోగ్య బీమా పాల సీలు, వి ద్య, క్యాన్సర్ మందులు, ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలన్నారు. ప్రధా ని మోదీ ధరలు తగ్గించి, దేశ ప్రజలకు “అసలైన దీపావళి”ని అందిస్తామని హామీ ఇచ్చారని.. చిత్త శుద్ధి ఉంటే ధరల మంటకు ప్రధాన కారణమైన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను తక్ష ణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. 

చెక్‌డ్యామ్ నిర్మించడం చేతకాని సర్కారు

 ఎస్‌ఎల్బీసీ టన్నెల్ తొవ్వడం చేతకాలేదని, సుంకిశాల రిటైనింగ్ వాల్ సరిగ్గా కట్టిం చే తెలివిలేకపోయిందంటూ   కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ మండిపడ్డారు. చివరికి ఓ చెక్ డ్యామ్‌ను కూడా నిర్మించలేని కాంగ్రెస్ స న్నాసులు కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్ల డం సిగ్గుచేటని విమర్శించారు. మహబూబ్‌నగర్‌లోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్దవాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్‌డ్యామ్ రెండు నెలల్లోనే ఎందుకు కొట్టుకుపోయిందో సీఎం రేవంత్‌రెడ్డి సమాధా నం చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలన్నారు.

 శాంతి భద్రతలపై నిమ్మకు నీరెత్తినట్లుగా  

 నగరంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నా సర్కారు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఎక్స్ వేదికగా  కేటీఆర్  ఆరోపించారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే పట్టపగలే ఓ ప్రముఖ జ్యువెలరీ షాపులో దోపిడీ దొంగలు తుపాకులతో బీభత్సం సృష్టించారని, కూకట్‌పల్లి పరిధిలో 12 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురి అయ్యిందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పెరుగుతున్న నేరాల రేటు ప్రజల భద్రతను మరింత ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. పోలీసులను రాజకీయ కక్షసాధింపు చర్యలకు ఉపయోగించడం, శాంతిభద్రతలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపకపోవడం వల్లే రాష్ర్టంలో ఈ పరిస్థితులు దాపురించాయని అన్నారు.