20-08-2025 01:52:49 AM
సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ తీర్పు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి వెయ్యి రూపాయల జరిమానాలతో పాటు ఒకరోజు కమ్యూనిటీ సేవ చేయాలని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ మంగళవారం కామారెడ్డి కోర్టులో వినుత్న తీర్పు ఇచ్చారు. కామారెడ్డి నిజాం సర్ చౌరస్తాలో నిలబడి మద్యం సేవించినందుకు కోర్టు నాకు ఒక్కరోజు కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించిందంటూ ప్లే కార్డ్ ధరించి నిలబడ్డారు. ఆ వ్యక్తిని చూసి రోడ్డుపై వెళ్లేవారు ఆసక్తిగా తిలకించారు.