20-08-2025 02:08:49 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన సీపీ రాధా కృష్ణన్‌కు మద్దతు ఇచ్చి, ఏకగ్రీవంగా గెలిపించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని ఈ మేరకు ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీసీ రాధాకృష్ణన్‌ను పార్లమెంట్ సభ్యులకు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. సీపీ రాధాకృష్ణన్ ఎన్నికను ఏకగ్రీ వం చేసుకునేందుకు కేంద్ర రక్షణశాఖ మం త్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రయత్నిస్తున్నారని, దీని లో భాగంగానే ప్రతిపక్షాలతో మంతనాలు చేయనున్నారని తెలిపారు. కాగా, బుధవారం ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి సీపీ రా ధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్‌రిజుజు ప్రకటించిన విషయం తెలిసిందే.
నెహ్రూ భారత్‌ను రెండు సార్లు విభజించారు..
భారత తొలిప్రధాని జవహర్‌లాల్ నె హ్రూ దేశాన్ని రెండు సార్లు విభజించారని ప్రధాని మోదీ ఎన్డీఏ ఆరోపించారు. ఎన్డీ యే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధా ని మాట్లాడుతూ.. ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో దేశాన్ని విభజిస్తే, మరోసారి సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విభజించారని అభిప్రాయపడ్డారు.
సిందూ జలాల ఒప్పం దంతో 80శాతం జలాలు పాకిస్థాన్‌కు వెళ్లాయని, ఒప్పందంతో భారత్ తీవ్రంగా నష్టపో యిందని, ఇక్కడ వ్యవసాయరంగం దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నెహ్రూ నే స్వయంగా అంగీకరించారని గుర్తుచేశారు. నెహ్రూ నాడు మంత్రి వర్గ ఆమోదం, పార్లమెంట్ ఆమోదం లేకుండానే నెహ్రూ పాకిస్థాన్ వెళ్లి సింధూ జలాల ఒప్పందం చేసుకుని వచ్చారని వెల్లడించారు.