13-09-2025 09:20:34 AM
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
గుమ్మడిదలలో బీఆర్ఎస్ ఆటో యూనియన్ జెండా ఆవిష్కరణ, భారీ ర్యాలీ
గుమ్మడిదల,(విజయక్రాంతి): కాంగ్రెస్ హయాంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తిగా అయోమయంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు(BRS state leaders) చిమ్ముల గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అనుబంధ సంస్థ బిఆర్‌టియు మల్లికార్జున ఆటో అసోసియేషన్ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. అనంతరం గుమ్మడిదల ప్రధాన వీధుల గుండా ఆటో ర్యాలీ నిర్వహించగా, ఆటో యజమానులు, డ్రైవర్లు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ హయాంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తిగా అయోమయంగా మారిందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడంతో పాటు ఆటో డ్రైవర్లకు నెలకు 12 వేల రూపాయలు జీతం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా, నేటివరకు అమలు చేయకపోవడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కూలీలు, కార్మికులు, ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, డ్రైవర్లు సంఘటితంగా ముందడుగు వేస్తేనే ప్రభుత్వాలు పట్టించుకుంటాయని ఆయన పిలుపునిచ్చారు. త్వరలోనే ఆటో డ్రైవర్లందరికీ బీమా సౌకర్యం కల్పించేందుకు బీఆర్ఎస్ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు నరసింహారెడ్డి, హనుమంత్ రెడ్డి, రాజశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, వేణు, నాయకులు దేవేందర్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి,తుపాకుల రాజు, వెంకట్రాంరెడ్డి, సత్యనారాయణ, మహిపాల్ రెడ్డి, రుక్మారెడ్డి,ఆంజనేయులు, గోపాల్,మురళి,ప్రకాష్, గణేష్,చక్రపాణి, రమేష్, ఆటో అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి వీర, అశ్వక్ ఖాన్, వెంకటేష్, శ్రీకాంత్ లక్ష్మీపతి, శివ, రమేష్, దయానంద్, స్థానిక నాయకులు, ఆటో యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.